Ghaati : అనుష్క హీరోయిన్ గా నటించిన ఘాటీ సినిమా నేడు థియేటర్లలోకి వచ్చింది. డైరెక్టర్ క్రిష్ మీద నమ్మకం, అనుష్కకు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టేసుకున్నారు ప్రేక్షకులు. కానీ చాలా వరకు మూవీకి యావరేజ్ టాక్ వచ్చేసింది. ఇందులో అనుష్క ఎంతో కష్టపడ్డా మూవీ బలమైన కథ, డైలాగులు, స్క్రీన్ ప్లే లేకపోవడంతో పెద్దగా ఆకట్టుకోవట్లేదు. ఇందులోని సీన్లు చూసిన వారంతా.. పుష్ప సినిమాలోని సీన్లతో పోల్చేస్తున్నారు. మనకు తెలిసిందే కదా.. పుష్ప సినిమాలో పుష్పరాజ్ ఎర్రచందనం తరలించడానికి కూలీగా పనిచేస్తాడు. కానీ తర్వాత తనకు పార్ట్ నర్ షిప్ కావాలని.. పార్ట్ నర్ అవుతాడు. అలా సిండికేట్ లో ఎదుగుతాడు.
Read Also : Navdeep : నవదీప్ ఇమేజ్ డ్యామేజ్.. అనవసరంగా జడ్జిగా వెళ్లాడా..?
ఘాటీ మూవీ కూడా ఇంచు మించు అలాంటిదే. ఇక్కడ ఘాటీలుగా పనిచేస్తున్న వారు గంజాయి స్మగ్లింగ్ చేస్తుంటారు. కాబట్టి వారికి కూడా కూలీ కాకుండా పార్ట్ నర్ షిప్ కావాలంటూ గొడవ చేస్తారు. ఆ సిండికేట్ రాజ్యంలో అనుష్క చేసిన ఫైట్లు, డైలాగులు పుష్పరాజ్ ను తలపిస్తున్నాయి. కాకపోతే ఇందులో ఫ్యామిలీ ఎమోషన్లు, లవ్ సీన్లు లేవు. పూర్తిగా గంజాయి స్మగ్లింగ్ చుట్టూ తిరుగుతుంది కథ. ఈ గంజాయి రాజ్యం చూసిన ప్రేక్షకులకు సినిమా పెద్దగా కనెక్ట్ కావట్లేదు. కానీ యాక్షన్ సీన్లు చూసిన వారికి కొన్ని పెద్ద సినిమాలు గుర్తుకు వస్తున్నాయి. మరి వీకెండ్ వరకు మూవీకి ఏమైనా కలెక్షన్లు పెరుగుతాయో లేదో చూడాలి. అనుష్క చాలా కాలం తర్వాత ఓ పెద్ద సినిమా చేసింది. ఆమె ఎంతో కష్టపడ్డా.. ఇందులో ఆ స్థాయి ప్రతిఫలం కనిపించట్లేదు.
Read Also : Shilpa Shetty : హీరోయిన్ శిల్పాశెట్టి దంపతులకు లుకౌట్ నోటీసులు