Ghaati : సీనియర్ హీరోయిన్ అనుష్క నటించిన ఘాటీ మూవీ సెప్టెంబర్ 5న రిలీజ్ కాబోతోంది. కానీ ప్రమోషన్లకు అనుష్క దూరంగా ఉండటంతో ఆమెపై రకరకాల ప్రచారాలు మొదలెట్టేశారు. అంత పెద్ద సినిమాకు కనీసం ప్రమోషన్లు చేయట్లేదని.. పొగరు చూపిస్తోందని ఇలా రకరకాల కామెంట్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. కానీ అనుష్క కెమెరా రాకపోవడానికి ఆమె కారణాలు ఆమెకు ఉండొచ్చు. కెమెరా ముందుకు రాకపోతే ఏంటి అని తాజాగా ప్రమోషన్ లో పాల్గొంది. ఇందులో భాగంగా హీరో రానాతో ఓ ఫోన్ కాల్ మాట్లాడి అందులో ఘాటీ మూవీని ప్రమోట్ చేసింది. వరుసగా ప్రింట్ మీడియాలో ఫోన్ లోనే ఇంటర్వ్యూలు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తుంటే ఆమెకు ప్రమోషన్లకు రావొద్దని లేదు.
Read Also : KGF Actor : కేజీఎఫ్-2 నటుడికి క్యాన్సర్.. సాయం కోసం ఎదురుచూపు
కాకపోతే ఆమె వ్యక్తిగత కారణాలతో కెమెరా ముందుకు రావొద్దని డిసైడ్ అయినట్టుంది. కెమెరాల ముందుకు వస్తేనే ప్రమోషన్ కాదని.. ముఖం కనిపించకపోయినా.. మాట వినిపిస్తే అదే ప్రమోషన్ అవుతుందని నిరూపించింది. దీంతో ఇన్ని రోజులు ఆమెను విమర్శించిన నోర్లు అన్నీ మూతబడ్డాయి. మనకు తెలిసిందే కదా గతంలో అనుష్క నటించిన ఏ సినిమా ప్రమోషన్లకు దూరంగా లేదు. అన్నింటినీ ప్రమోషన్ చేసింది. అలాంటప్పుడు ఆమె ఈ సినిమా విషయంలో ఇలా ఉందంటే.. ఆమె వ్యక్తిగత కారణాలను కూడా అర్థం చేసుకోవాలని కోరుతున్నారు ఫ్యాన్స్.
Read Also : Mirai : మిరాయ్ లో మహేశ్ బాబు.. తేజ సజ్జా షాకింగ్ కామెంట్స్