డిజిటల్ యుగంలో ప్రతి వ్యక్తి హక్కుల రక్షణ కీలక అంశంగా మారింది. కృత్రిమ మేధస్సు (AI) ద్వారా రూపొందుతున్న కంటెంట్ వ్యక్తిగత హక్కులకు సవాలుగా మారుతోంది. AI కారణంగా ఎంత మంచి ఉందొ అంతకు మించి చెడు కూడా జరుగుతోంది. ముఖ్యంగా సినిమా సెలెబ్రేటిస్ AI వలన అనేక ఇబ్బందులు పడుతున్నారు. AI ద్వారా సినిమా ప్రముఖుల వాయిస్, ముఖచిత్రాలను తయారుచేసి వ్యక్తిత్వ హక్కులకి భంగం కలిగిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయమై టాలీవుడ్ సెలేబ్రిటిస్ అయిన మెగా స్టార్ చిరు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యక్తిత్వ హక్కుల దుర్వినియోగంపై హై కోర్టును ఆశ్రయించి విముక్తి పొందారు.
Also Read : Tollywood : ‘ప్రబల తీర్థం’ నేపథ్యంతో శ్రీకాంత్ అడ్డాల కొత్త సినిమా
ఇక ఇప్పుడు లేటెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరా నందన్ తన వ్యక్తిత్వ హక్కులు (Personality Rights) కాపాడాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసాడు. తనపై ఏఐ సాయంతో రూపొందించిన చిత్రాలు, వీడియోలు, ఇతర డిజిటల్ కంటెంట్ అనుమతి లేకుండా ప్రచారం చేస్తున్నారు ఇది నా వ్యక్తిగత స్వేచ్చకు భంగం కలుగుతుందని పేర్కొంటూ పిటిషన్ లో పేర్కొన్నారు. సత్వరం అలాంటి ఏఐ-సృష్టిత కంటెంట్‌ను అన్ని డిజిటల్ వేదికల నుంచి తొలగించాలని కోర్టును కోరాడు అకిరా. అంతేకాకుండా, భవిష్యత్తులో తన పేరుతో గాని, ఫొటోస్ గాని వాయిస్ కు గాని లేదా వ్యక్తిత్వాన్ని ఆధారంగా చేసుకుని ఏఐ ద్వారా ఎలాంటి కంటెంట్ సృష్టించకుండా ఉత్తర్వలు ఇవ్వాలని కూడా పిటిషన్‌లో అభ్యర్థించారు. ఈ కేసు, సెలబ్రిటీలతో పాటు సామాన్యులకూ వర్తించే వ్యక్తిత్వ హక్కులు, డిజిటల్ గోప్యత, ఏఐ కట్టడి వంటి అంశాలపై న్యాయవ్యవస్థ ఎలా స్పందిస్తుందన్న దానిపై ఆసక్తిని పెంచుతోంది. హైకోర్టు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో ఏఐ కంటెంట్ వినియోగం, నియంత్రణకు మార్గదర్శకంగా నిలిచే అవకాశముందని న్యాయవర్గాలు భావిస్తున్నాయి.