టాలీవుడ్ లో ప్రభాస్- అనుష్క లో జంటకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిల్లా, మిర్చి, బాహుబలి సినిమాల్లో వీరి కెమిస్ట్రీ చూసి అభిమానులు కూడా వీరు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని అనుకున్నారు. అంతేకాకుండా త్వరలో ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు కూడా వార్తలు గుప్పుమన్నాయి. అయితే తాము మంచి స్నేహితులమే తప్ప తమ మధ్య ఎటువంటి రిలేషన్ లేదని చెప్పుకొచ్చారు. ఇక ఇటీవల ప్రభాస్ పెద్దమ్మ కూడా స్వీటీ మంచి స్నేహితురాలు మాత్రమే అని చెప్పడంతో ఈ పుకార్లకు చెక్ పడినట్లే. అయితే స్వీటీ ఎట్టకేలకు ప్రభాస్ కి ఓకే చెప్పినట్లు వార్తలు మరోసారి షికార్లు చేస్తున్నాయి. అయితే ఈ వార్త పెళ్ళికి సంబంధించింది కాదులెండి.. ప్రస్తుతం ప్రభాస్ వరుస పాన్ ఇండియా ల మధ్య మారుతితో కలిసి ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
రాజా డీలక్స్ అనే పేరుతో వస్తున్న ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య నిర్మించబోతున్నారట. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ సరసన అనుష్క నటించనున్నదట. పాత్రకు ప్రాధాన్యత ఉండడంతో స్వీటీ కూడా ప్రభాస్ కి ఓకే చెప్పినట్లు సమాచారం. ఇక అనుష్కతో పాటు ఈ చిత్రంలో మరో ఇద్దరు ముద్దుగుమ్మలు కూడా సందడి చేయనున్నారట. ఇక సినిమాలో ఎంతమంది ముద్దుగుమ్మలు ఉన్నా ప్రభాస్- అనుష్క జంట ఉంటే వాళ్ళందరూ కనిపించరు అని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఈ వార్తే కనుక నిజమైతే అభిమానులకు పండగే పండుగ. త్వరలోనే ఈ శుభవార్తను మేకర్స్ అధికారికంగా ప్రకటించాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.