మలయాళ కుట్టీ అనుపమా పరమేశ్వరన్ నటించిన '18 పేజీస్' మూవీ ఈ నెల 23న జనం ముందుకు రాబోతోంది. ఆ తర్వాత వారమే అంటే 29వ తేదీ అనుపమా నటించిన లేడీ ఓరియంటెడ్ థ్రిల్లర్ మూవీ 'బట్టర్ ఫ్లై' తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.
ప్రపంచంలోని చాలా మంది వ్యక్తులకు తమ కలల గమ్యస్థానానికి వెళ్లాలనే కోరిక ఉంటుంది. అలా విభిన్న నేపథ్యం ఉన్న నలుగురు బైక్ రైడర్లు తమ గమ్యానికి చేరుకునే మార్గంలో ఒకరికొకరు పరిచయమై, ఒకరి గురించి మరొకరు ఏం తెలుసుకున్నారు? గమ్యానికి ఎలా చేరుకున్నారు? అనే ఆసక్తికర కథాంశంతో ఇదే మా కథ చిత్రం తెరకెక్కింది. ఈ రోడ్ జర్నీ చిత్రంలో సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమికా చావ్లా, తాన్య హోప్ ప్రధాన పాత్రల్లో నటించారు. గురు పవన్…