‘సారాంశ్’ రీమేక్ చేస్తే బాగుంటుందన్న అనుపమ్ ఖేర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జాతీయ స్థాయిలో స్పెషల్ జ్యూరీ అవార్డులను రెండుసార్లు అందుకున్నాడు నటుడు అనుపమ్ ఖేర్. 37 సంవత్సరాలలో వివిధ భాషల్లో 518 సినిమాలలో నటించాడు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాకు ఛైర్మన్ గా పనిచేశారు. పద్మశ్రీ , పద్మభూషణన్ పురస్కారాలను అందుకున్నారు. ఆయన ప్రధాన పాత్ర పోషించిన హిందీ సినిమా ‘సారాంశ్’ 37 సంవత్సరాల క్రితం మే 25న విడుదలైంది. ఆ రోజుల్ని తలుచుకుంటూ అనుపమ్ ఖేర్ ఇన్ స్టాగ్రామ్ లో అప్పటి సినిమాలోని ఓ సన్నివేశాన్ని ఇప్పుడు యాక్ట్ చేసి, ఆ వీడియోను పోస్ట్ చేశారు. ‘సారాంశ్’ సినిమా ఇప్పుడు రీమేక్ చేసినా బాగుంటుందని, ఇప్పటికీ ఆ పాత్ర చేయడానికి తాను సిద్ధమేనని అన్నారు. ప్రతిష్ఠాత్మక రాజశ్రీ సంస్థ మహేశ్ భట్ దర్శకత్వంలో నిర్మించిన ‘సారాంశ్’ చిత్రంలో తన వయసుకు దాదాపు రెట్టింపు వయసున్న పాత్రను అనుపమ్ ఖేర్ పోషించారు. ఆయనకు అప్పట్లో 29 సంవత్సరాలు కాగా 60 సంవత్సరాల వృద్థుడి పాత్రను చేశారు. ఈ సినిమా విడుదల సమయంలోనే భివండీలో కలహాలు చెలరేగడం దురదృష్టకరం అన్నారు. ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు విశేషంగా దక్కాయి. ‘సారాంశ్’ను ప్రదర్శిస్తున్న మెట్రో సినిమా థియేటర్ కు వెళ్ళి తాను బయట నిలబడే వాడినని, ఎవరైనా గుర్తుపడతారేమోనని చూసేవాడినని, అయితే తాను సినిమాలో పోషించింది వృద్ధుడి పాత్ర కావడంతో ఎవరూ గుర్తించలేకపోయేవారని అనుపమ్ ఖేర్ ఆనాటి రోజుల్ని తలుచుకున్నారు.
Also Read
- Spy Action Thriller: థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్
- Laikey Laikaa: రాషా థడానీ ఇంటెన్స్ రొమాంటిక్ యాక్షన్ ఆగిపోలేదు.. వాలెంటైన్స్ డేకు వస్తోంది..
- APFDC: సినిమా షూటింగ్స్‌కు సింగిల్ విండో.. విశాఖను ఫిల్మ్ హబ్‌గా మార్చేందుకు కీలక నిర్ణయాలు
- Mamitha Baiju : రెమ్యునరేషన్ పెంచేసిన మమిత బైజు.. రూ. 3 కోట్లు డిమాండ్?
తాజావార్తలు
-
Venus Enters Libra: సెప్టెంబర్ 2 నుంచి ఈ 4 రాశుల వారికి అదృష్టమే అదృష్టం.. ఉద్యోగం, డబ్బు, వాహనం కొనుగోలు యోగం!
-
Skincare Tips: బ్యూటీ పార్లర్‌కు బై బై చెప్పండి!.. ఇంట్లోనే సహజంగా ముఖానికి మెరుపు తెచ్చే 3 టిప్స్ ఇవే..
-
Spy Action Thriller: థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Nepal Floods: “నువ్వు దేవుడు సామీ”.. వరదల్లో 1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన ప్రిన్సిపాల్
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!