నందమూరి ఫ్యామిలీ నుంచి స్వర్గీయ నందమూరి తారకరామారావు వారసులుగా ఇప్పటికే బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు స్టార్ హీరో స్టేటస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. బాలయ్య మూడున్నర దశాబ్దాలుగా TFIకి మెయిన్ పిల్లర్స్ లో ఒకడిగా ఉన్నాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాతకి తగ్గ మనవడిగా టాప్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. నందమూరి వంశానికి సరైన వారసుడిగా, నందమూరి అనే ఇంటి పేరుతో పాటు తాత తారకరామారావు పేరుని కూడా పాన్ వరల్డ్ వరకూ తీసుకోని వెళ్లాడు ఎన్టీఆర్. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ ఇమేజ్ ని కూడా ఎన్టీఆర్ సొంతం చేసుకున్నాడు. ఇక కళ్యాణ్ రామ్ కూడా ఇప్పుడిప్పుడే ఫ్లాప్స్ నుంచి బయటకి వచ్చి మినిమం గ్యారెంటీ సినిమాలని చేస్తున్నాడు. బింబిసార సినిమాతో డబుల్ బ్లాక్ బస్టర్ కొట్టిన కళ్యాణ్ రామ్ నెక్స్ట్ ‘డెవిల్’ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఇలా ముగ్గురు హీరోలు స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తున్న నందమూరి ఫ్యామిలీ నుంచి కొత్త హీరో లాంచ్ అవుతున్నాడు. నందమూరి జయకృష్ణ కొడుకు అయిన నందమూరి చైతన్య కృష్ణ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. బసవ తారకరామా క్రియేషన్స్ పేరుతో సొంత బ్యానర్ ని స్థాపించి చైతన్య కృష్ణ హీరోగా డెబ్యు ఇవ్వడానికి రెడీ అయ్యాడు.
గతేడాది మే నెలలో చైతన్య కృష్ణ హీరోగా వంశీ కృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా అనౌన్స్ అయ్యింది. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కూడా జరుపుకుంటుంది. బాలయ్య లాంచ్ చేసిన ఈ మూవీ టైటిల్ ని మార్చ్ 5న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మరి నందమూరి కుటుంబం నుంచి వస్తున్న ఈ కొత్త హీరో ఎంతవరకూ ప్రేక్షకులని మెప్పిస్తాడు అనేది చూడాలి. మరోవైపు బాలయ్య కొడుకు నందముర్ మోక్షజ్ఞ హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఆదిత్య 369కి సీక్వెల్ గా స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న ఆదిత్య 999 సినిమాలో మోక్షజ్ఞ నటిస్తాడు అనే మాట ఇండస్ట్రీలో ఉంది. ఈ టైం ట్రావెల్ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది? కథని అందిస్తున్న బాలయ్యనే దర్శకత్వం వహిస్తాడా? మోక్షజ్ఞ ఈ ప్రాజెక్ట్ లో నటిస్తాడా అనే విషయాల్లో క్లారిటీ రావాల్సి ఉంది.
https://twitter.com/BTRcreations/status/1631520587771449345