Anirudh Ravichandran:కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిరుధ్ తెలుగులో పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అజ్ఞాతవాసి చిత్రంతో పరిచయమయ్యాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన మ్యూజిక్ మాత్రం ఇప్పటికి వినిపిస్తూనే ఉంది. ఇక ఈ సినిమా తరువాత అనిరుధ్ సైతం తెలుగు ఫేవరేట్ గా మారిపోయాడు. ప్రస్తుతం ఈ కుర్ర సంగీత దర్శకుడు దేవర సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక మ్యూజిక్ విషయంలో ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడో.. రిలేషన్స్ విషయంలో అంతే చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. మొదటి నుంచి కూడా అనిరుధ్.. అమ్మాయిల విషయంలో చాలా వివాదాలను ఎదుర్కొంటూనే వస్తున్నాడు.
Salman Khan: 57 ఏళ్ల వయస్సులో సల్మాన్ ఖాన్ పెళ్లి.. వధువు ఎవరంటే.. ?
సుచీ లీక్స్ లో సైతం అనిరుధ్.. హీరోయిన్ ఆండ్రియా డీప్ గా లిప్ లాక్ పెట్టుకుంటున్న ఫోటో లీక్ అయ్యి సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. ఇక గత కొన్నిరోజులుగా అనిరుధ్ .. సింగర్ జోనితా గాంధీతో ఎఫైర్ నడుపుతున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. జోనితా.. బీస్ట్ సినిమాలో అరబిక్ కుత్తు సాంగ్ పాడి ఫేమస్ అయ్యింది. ఆ తరువాత విక్రమ్ లో ఈ జంట మౌనింగ్ ఎంతటి సంచలనం క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అప్పటినుంచే వీరి మధ్య ప్రేమ చిగురించిందని తెలుస్తోంది. అనిరుధ్ ఎక్కడ ఉంటే జోనితా అక్కడే కనిపిస్తోంది. దీంతో వీరు డీప్ లవ్ లో ఉన్నారని, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని అంటున్నారు. ఇక ఈ వార్తలను ఈ జంట ఖండించింది లేదు.. సమ్మతించింది లేదు. మరి అసలు వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్ నిజమా..? కదా..? అనేది తెలియాలంటే ఈ జంట నోరు విప్పాల్సిందే అని అభిమానులు చెప్పుకొస్తున్నారు.