సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన యానిమల్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లని రాబడుతోంది. ఏ సెంటర్ బీ సెంటర్ అనే తేడా లేదు… నార్త్ సౌత్ అనే బేధం లేదు… ఆల్ సెంటర్స్ లో అనిమల్ మూవీ ఎర్త్ షాటరింగ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. 15 రోజుల్లో 800 కోట్లు రాబట్టిన అనిమల్ సినిమా… డిసెంబర్ 21లోపు వెయ్యి కోట్ల మార్క్ టచ్ చేసేలా కనిపిస్తుంది. ఒక ఏ రేటెడ్ సినిమా, మూడున్నర గంటల నిడివి ఉన్న సినిమా, ఈ రేంజ్ కలెక్షన్స్ రాబట్టడం ఇదే మొదటిసారి. అనిమల్ సినిమా హిట్ అవుతుంది అని అందరూ నమ్మారు కానీ మరీ ఈ స్థాయి హిట్ అవుతుందని కలలో కూడా ఊహించి ఉండరు. స్లో అవ్వడం అసలు తెలియనట్లు అనిమల్ సినిమా ఇప్పటికీ థియేటర్స్ లో స్ట్రాంగ్ హోల్డ్ మైంటైన్ చేస్తుంది. ఇదిలా ఉంటే.. యానిమల్ సినిమా క్లైమాక్స్ లో సీక్వెల్ “అనిమల్ పార్క్” అనౌన్స్ అయిపొయింది.
పోస్ట్ క్రెడిట్స్ లో వచ్చిన “అనిమల్ పార్క్” గ్లిమ్ప్స్ ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పించింది. ఈ గ్లిమ్ప్స్ లో రణబీర్ ని మరింత వైల్డ్ గా ప్రెజెంట్ చేసాడు సందీప్ రెడ్డి వంగ. ప్రభాస్ తో స్పిరిట్, అల్లు అర్జున్ తో మూవీ చేసిన తర్వాత అనిమల్ పార్క్ మూవీ సెట్స్ పైకి వెళ్తుందని అంతా అనుకున్నారు కానీ ఊహించని దాని కన్నా ముందే అనిమల్ పార్క్ సెట్స్ పైకి వెళ్లేలా కనిపిస్తోంది. రణబీర్ బ్రహ్మాస్త్ర 2కి టైమ్ పడుతుంది, ప్రభాస్ కమిట్మెంట్స్ కంప్లీట్ అవ్వడానికి కూడా టైమ్ పడుతుంది… ఈ గ్యాప్ లో అనిమల్ పార్క్ సినిమాని కంప్లీట్ చేయడానికి సందీప్ రెడ్డి వంగ రెడీ అవుతున్నాడని బాలీవుడ్ వర్గాల సమాచారం. ఇదే నిజమైతే ఇండియన్ బాక్సాఫీస్ ముందుకి ఇప్పటివరకూ చూడనంత మోస్ట్ హైప్డ్ మూవీ రాబోతుంది. ఈ సీక్వెల్ గురించి పూర్తి వివరాలు తెలియనప్పటికీ, రివీల్ చేసిన పాయింట్స్ వరకూ చూస్తే… “ఇస్తాంబుల్ లో ఉండే అనిమల్ కి, ఢిల్లీ రన్ విజయ్ సింగ్ కి మధ్య వార్” ఉండేలా ఉంది. అంటే రణబీర్ డ్యూయల్ రోల్ ప్లే చేస్తూ… రణబీర్ vs రణబీర్ వార్ గా సీక్వెల్ రూపొందనుంది. ఇద్దరు వైల్డ్ అనిమల్స్ లాంటి మనుషులు కొట్టుకుంటే వయొలెన్స్ అనే పదానికే కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేయడం గ్యారెంటీ.