ప్రస్తుతం టాలీవుడ్‌లో… కాదు కాదు పాన్ ఇండియా లెవల్లో సందీప్ రెడ్డి వంగా ఓ సన్సేషన్. రణ్‌బీర్ కపూర్‌ని అనిమల్‌గా చూపించి బాక్సాఫీస్ బద్దలు చేశాడు. అనిమల్ రిలీజ్ అయి మూడు వారాలైనా… థియేటర్ల దగ్గర హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. కేవలం 14 రోజుల్లోనే 784.45 కోట్ల వసూళ్లు రాబట్టింది అనిమల్ సినిమా. ఇది రణబీర్ కెరీర్ కే కాదు ఈ ఇయర్ ఇండియన్ బాక్సాఫీస్ కే బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. అనిమల్ సినిమా రిలీజ్ అయిన ఇన్ని రోజుల తర్వాత కూడా ముంబైలో స్పెషల్ షోలు పడుతున్నాయంటే… అనిమల్ క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మంచి జోష్ లో సెకండ్ వీక్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ… ఖచ్చితంగా థర్డ్ వీక్‌లో అనిమల్ వెయ్యి కోట్ల మార్క్‌ని టచ్ చేయడం గ్యారెంటీగా కనిపిస్తోంది. అదే జరిగితే… తెలుగులో రాజమౌళి తర్వాతి ప్లేస్ సందీప్ రెడ్డి వంగదే.
తెలుగు నుంచి వెయ్యి కోట్లు క్రాస్ చేసిన ఇండియన్ టాప్ 5 సినిమాల్లో బాహుబలి2, ట్రిపుల్ ఆర్ ఉన్నాయి. బాహుబలి 2 సినిమా 1800 కోట్లకు పైగా రాబట్టగా… ట్రిపుల్ ఆర్ 1300 కోట్ల రాబట్టింది. సౌత్ నుంచి ప్రశాంత్ నీల్, అట్లీ సంగతి పక్కన పెడితే… తెలుగు నుంచి మాత్రం రాజమౌళి తర్వాత వెయ్యి కోట్లు రాబట్టిన దర్శకుడిగా సందీప్ రెడ్డి రికార్డ్ క్రియేట్ చేసేలానే ఉన్నాడు. అయితే… ప్రజెంట్ సెట్స్ పై ఉన్న తెలుగు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌లో పుష్ప2 వెయ్యి కోట్లు కొల్లగొట్టేలా ఉంది కానీ.. సుకుమార్ కంటే ముందే వెయ్యి కోట్ల తెలుగు డైరెక్టర్‌గా సందీప్ రెడ్డి టాప్2 లోకి దూసుకొచ్చేలా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం థియేటర్లో ఎక్కడ చూసినా అనిమల్ హవానే కనిపిస్తోంది కాబట్టి… తెలుగు దర్శకుల్లో రాజమౌళి తర్వాతి ప్లేస్ సందీప్ రెడ్డిదే అని చెప్పడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. ఏదేమైనా… హిందీ హీరోతోనే సందీప్ ఇంత రచ్చ చేస్తే.. నెక్స్ట్ ప్రభాస్ లాంటి పాన్ ఇండియా కటౌట్‌తో కలిసి ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.
The #Animal beast continues to dominate. 🔥
Book your Tickets 🎟️https://t.co/kAvgndK34I#AnimalTakesOverTheNation #AnimalInCinemasNow #Animal #AnimalHuntBegins #BloodyBlockbusterAnimal #AnimalTheFilm @AnimalTheFilm @AnilKapoor #RanbirKapoor @iamRashmika @thedeol… pic.twitter.com/2T7HzTP5KO
— Animal The Film (@AnimalTheFilm) December 15, 2023