Sankranthi 2027 : సంక్రాంతికి రావిపూడి పక్కా.. నో డౌట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ‘సంక్రాంతి’ అంటే కేవలం పండగ మాత్రమే కాదు, అదొక యుద్ధం. ముఖ్యంగా ‘హిట్ మెషిన్’ అనిల్ రావిపూడికి సంక్రాంతి సీజన్ అంటే విడదీయలేని అనుబంధం ఉంది ఈ క్రమంలోనే వచ్చే ఏడాది అంటే 2027 సంక్రాంతి బరిలో విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్‌లతో కలిసి ఒక భారీ మల్టీస్టారర్ సినిమాతో పలకరించాలని అనిల్ గట్టి ప్లాన్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ పనుల్లో ఆయన నిమగ్నమై ఉన్నారు. అయితే అనిల్ రావిపూడి ఈ రేసు నుంచి తప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని, దీనికి ప్రధాన కారణం మరేదో కాదు, వెంకటేష్ నటిస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘ఆదర్శ కుటుంబం’ అని ప్రచారం మొదలైంది. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆదర్శ కుటుంబం’ నిజానికి 2026 దసరా కానుకగా విడుదల కావాల్సి ఉంది.
కానీ, షూట్ లేట్ కావడం లాంటి కొన్ని తాజా పరిణామాల దృష్ట్యా ఈ చిత్రం వాయిదా పడి 2027 సంక్రాంతి సీజన్‌ను టార్గెట్ చేస్తోందనే ప్రచారం జరుగుతోంది. ఒకే హీరో (వెంకటేష్) నటించిన రెండు భారీ సినిమాలు ఒకే పండగ సీజన్లో రావడం ట్రేడ్ పరంగా అస్సలు సాధ్యం కాదు. దీనివల్ల వసూళ్లపై ప్రభావం పడటమే కాకుండా థియేటర్ల సర్దుబాటు కూడా కష్టమవుతుంది. ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడి వెనక్కి తగ్గక తప్పదని ఆ ప్రచారం సారాంశం. అయితే అదేదీ నిజం కాదని అనిల్ సన్నిహితుల సమాచారం. ఇప్పటికే త్రివిక్రమ్ సినిమా 60 % షూట్ పూర్తయిందని, ఆ సినిమా ఖచ్చితంగా దసరాకి రిలీజ్ అవుతుందని తెలుస్తోంది. ఇక ఆ సినిమా షూట్ పూర్తయిన వెంటనే అనిల్ రావిపూడి సినిమా పట్టాలెక్కడం ఖాయమని సమాచారం. వెంకీ-అనిల్ కాంబోలో ఇప్పటికే వచ్చిన సినిమాలు సంక్రాంతికి సందడి చేశాయి, మరోసారి అనిల్ రావిపూడి తన సెంటిమెంట్‌ను కొనసాగించనున్నారు.
Also Read
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
- Alias Rukmini Heroine: 'అలియాస్ రుక్మిణీ'.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
- Ranabaali Trailer: 'రణబాలి' ట్రైలర్‌పై మంత్రి లోకేష్ రివ్యూ!
తాజావార్తలు
-
Jantar Mantar Protest: ఢిల్లీలో హైటెన్షన్.. అదుపులోకి మమతా, కేజ్రీవాల్, విజయన్.!
-
Vijay Deverakonda: “బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!”.. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
-
Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
-
CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
-
Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!