విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మల్టీస్టారర్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఎఫ్3. మే 27 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఎఫ్ 3 ప్రీ రిలీజ్ ఈవెంట్ శిల్పకళావేదికలో ఘనంగా జరిగింది. ఇక ఈ వేదికపై డైరెక్టర్ అనిల్ మాట్లాడుతూ “2020 తర్వాత అందరికి ఒక 2 ఇయర్స్ ఒక చిన్న బ్రేక్ వచ్చింది పాండమిక్ ద్వారా.. ఈ సినిమా కూడా ఆ పాండమిక్ లోనే స్టార్ట్ చేశాం.. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్.. ఇలా ఎన్నో అడ్డంకులను దాటుకొంటూ ఈరోజు మే 27 మీ ముందుకు రాబోతుంది. ఇది చాలా పెద్ద జర్నీ.. మిమ్మల్ని నవ్వించడానికి చాలా స్ట్రగుల్ అయ్యి వాటిని క్రియేట్ చేసి ఎందుకంటే మా ముందున్న పెద్ద ఎనిమీ ఎఫ్ 2.. అదే మాకు ఉన్న పెద్ద శత్రువు. ఎందుకంటే ఎఫ్ 2 ను మీరందరు చాలా ఎంజాయ్ చేశారు. ఈ సినిమను దానికి మించి ఇవ్వాలి. ఎందుకంటే దానికి సీక్వెల్ గా వస్తుంది కాబట్టి.. స్క్రిప్ట్ నుంచి కూడా చాలా కష్టపడుతూ వచ్చాం. ఈ సినిమా షూటింగ్ లో నన్ను భరించిన నా టీమ్ కు థాంక్స్ చెప్తున్నా.
ఇక ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.. ఇలా ప్రతి ఒక్కరి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే నేను మొత్తం 35 మంది ఆర్టిస్టులతో కలిసి వర్క్ చేశాను. ప్రతి ఒక్కరు తమ బెస్ట్ ఇచ్చారు. ఇక దిల్ రాజు గారు .. వారు నాకు ప్రొడ్యూసర్స్ కంటే ఒక ఫ్యామిలీ అని చెప్పాలి. అందుకే కంటిన్యూ గా సినిమాలు చేస్తూనే ఉన్నాం.. చేస్తూనే ఉంటాం. ఇక ఈ సినిమా కేవలం కామెడీ మాత్రమే కాదు కథ కూడా ఉంటుంది.. ఈ సినిమా చూసాకా లైఫ్ గురించి, డబ్బు యొక్క విలువ గురించి తెలుసుకుంటారని నమ్ముతున్నాను. ఇక మా హీరోలు.. వరుణ్ తేజ్.. నాకొక బ్రదర్ లాగా.. ఎఫ్ 2 నుంచి ఎఫ్ 3 కి రావడానికి.. నిజం చెప్పాలంటే ఎఫ్ 2 ఇచ్చిన ఎనర్జీనే ఎఫ్ 3 వరకు తీసుకొచ్చింది. వరుణ్ ను ఎఫ్ 2 లో ఒకలా చూసారు.. ఎఫ్ 3 లో మీరు ఎలా చూడబోతున్నారో ఆల్రెడీ ట్రైలర్ లో చూసారు. ఈ సినిమా వరుణ్ తేజ్ కు మంచి గుర్తింపు తీసుకొస్తుంది. వరుణ్ లో ఇంత కామెడీ టైమింగ్ ఉందా అని మీరు అనకపోతే అప్పుడు అడగండి.. వరుణ్ ఆల్ ది బెస్ట్.. అప్పుడప్పుడు వరుణ్ ఇలాంటి సినిమాలు కూడా చేస్తూ ఉండు.. ఇక వెంకటేష్ గారు గురించి చెప్పాలంటే.. ఒక్కటే మాట.. ఐ లవ్ యూ సర్.. ఎందుకంటే 35 మంది ఆర్టిస్టులు ఉన్నప్పుడు ఆయన ఇచ్చే ఎనర్జీ మాములుగా ఉండదు. వెంకీ గారు, వరుణ్ ఇద్దరు నన్ను ఒక షీల్డ్ లాగా పుష్ చేస్తారు. వెంకీ గారు ఒక స్టార్ హీరో.. స్టార్ ఇమేజ్ ఉన్న హీరో .. కానీ కామెడీ చేసేటప్పుడు ఆ ఇమేజ్ ను పక్కన పెట్టి ఒక చిన్న పిల్లాడిగా పెర్ఫార్మ్ చేస్తారు. ఒక బౌండరీ దాటి ఆ ఇమేజ్ ను దాటి చేయగల హీరో వెంకటేష్ గారు.. ఎఫ్ 2 లో ఎంత బాగా నవ్వించారో అంతకు పదింతలు ఎఫ్ 3 లో ఆయన నవ్విస్తారు. నవ్వడం ఒక భోగం.. నవ్వించడం ఒక యోగం.. నవ్వలేకపోవడం ఒక రోగం.. ఇక్కడ ఉన్నవారందరూ అదే పనిచేశారు. ఈ రెండేళ్లలో మనం చాలా ఫేస్ చేశాం .. జస్ట్ రిలాక్స్ .. నవ్వుకోండి.. నవ్వుకోండి” అని చెప్పుకొచ్చారు.