Anil Ravipudi : సుడిగాలి సుధీర్ ను బుల్లితెర షోలల్లో ఎంతలా రోస్ట్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. షో ఏదైనా సరే సుధీర్ మీద పంచులు వేయాల్సిందే. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా.. షోలోని ప్రతి ఒక్కరూ సుధీర్ ను రోస్ట్ చేసేవారు. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా దీనికి అతీతుడు కాదు. కామెడీ స్టాక్ ఎక్స్ ఛేంజ్ ప్రోగ్రామ్ లో జడ్జిగా చేసిన అనిల్.. ఆ షోలో సుధీర్ ను రోస్ట్ చేసేవాడు. దీనిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. వాస్తవానికి సుధీర్ ను రోస్ట్ చేయడం నాకు అస్సలు నచ్చదు. అతను చాలా మంచి వ్యక్తి. ఎవరినీ ఏమీ అనడు. సుధీర్ పై ఎందుకు పంచులు వేయాలి అని నాకు ఎప్పుడూ అనిపించేది. కానీ ఆ షో వాళ్లే అలా చేయమనేవారు.
Read Also : Rakul Preet Singh : ఆస్తులు తనఖా పెట్టాం.. రకుల్ ప్రీత్ సింగ్ ఫ్యామిలీ కామెంట్స్..
సుధీర్ ను రోస్ట్ చేయడమే కాన్సెప్ట్ అని చెప్పేవాళ్లు. షో మేనేజ్ మెంట్ అలా చెప్పిన తర్వాత మనమేం చేస్తాం. అప్పటికీ నేను చాలా పంచులను వేసేవాడిని కాదు. అవి హద్దులు దాటినట్టు ఉంటాయి. సున్నితంగా అనిపించేవే వేసేవాడిని. సుధీర్ మాత్రం ఇవన్నీ పట్టించుకోడు. జనాలు నవ్వడమే మనకు కావాలి. మీరేం ఇబ్బంది పడకండి అని నాకు చెప్పేవాడు. అందుకే అతనంటే నాకు చాలా ఇష్టం. సినిమాల్లో హీరోగానూ సినిమాలు చేశాడు. అలాంటి టైమ్ లో కూడా పంచులు వేయించుకోవడం ఒక్క సుధీర్ కు మాత్రమే సాధ్యం. అందుకే అతనంటే చాలా మంది ఇష్టపడుతారు అని చెప్పుకొచ్చాడు అనిల్ రావిపూడి. ప్రస్తుతం అనిల్ చిరుతో మూవీ చేస్తున్నాడు. ఇందులో భారీ కాస్టింగ్ ఉండబోతోంది. కామెడీ ఎంటర్ టైన్ మెంట్ గా దీన్ని తీస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూట్ స్పీడ్ గా సాగుతోంది.
Read Also : Saif Ali Khan : రూ.15వేల కోట్లు పోగొట్టుకున్న సైఫ్ అలీఖాన్..