సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాతో వెంకటేష్ ఏకంగా మూడు వందల కోట్ల క్లబ్‌లో జాయిన్ అయ్యారు. అంతేకాదు, సీనియర్ హీరోలలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన హీరోగా కూడా నిలిచాడు. ఈ సినిమా పూర్తి అయిన తర్వాత నీళ్లు రాకపోతే, ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో 150వ సినిమా చేస్తున్నాడు. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి చాలా వరకు షూటింగ్ పూర్తయింది.
Also Read: Anil Ravipudi: మెగా 157లో వెంకటేష్ పాత్ర.. ఎట్టకేలకు ఓపెనైన అనిల్ రావిపూడి
తాజాగా డ్రామా జూనియర్స్ ప్రోగ్రాంకి జడ్జిగా వ్యవహరిస్తున్న అనిల్ రావిపూడి, ఎన్‌టీవీతో ప్రత్యేకంగా సంభాషిస్తూ మెగాస్టార్ చిరంజీవి సినిమాకు సంబంధించి చాలా ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. నిజానికి ఈ సినిమా కూడా అవుట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్ అని అందరూ అనుకున్నారు. కానీ ఆ విషయంలోనే అనిల్ రావిపూడి షాక్ ఇచ్చాడు. అదేంటంటే, సంక్రాంతికి వస్తున్నాం సినిమా 90% కామెడీతో ఉంటే, ఈ సినిమా మాత్రం కేవలం 70 శాతం మాత్రమే కామెడీతో ఉంటుందని ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు అన్నారు. అలా అని ప్రీచీగా ఉండదు, సినిమాకు తగ్గట్టుగా ఉంటుందని చెప్పుకొచ్చారు.