సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న అనిల్ రావిపూడి ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన డ్రామా జూనియర్స్ కార్యక్రమానికి జడ్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్‌టీవీతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన డ్రామా జూనియర్స్‌తో పాటు మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్న సినిమా గురించి బలమైన విషయాలు పంచుకున్నారు. అయితే ఆయన వెంకటేష్ పాత్ర గురించి మాత్రం ఎలాంటి వివరాలు బయట పెట్టలేదు. నిజానికి మెగాస్టార్ చిరంజీవి సినిమాలో వెంకటేష్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇది కేవలం అతిథి పాత్ర కాదు, అంతకు మించి ఉండబోతుందని అంటున్నారు.
Also Read:Piracy : పైరసీ చేసి 50 లక్షలు సంపాదించిన కిరణ్ ..ప్రైవేటు వీడియోలు కూడా ?
అయితే ఈ వెంకటేష్ గురించి అడిగితే మాత్రం దానికి అనిల్ రావిపూడి దాటవేశారు. “ఇప్పుడే మాట్లాడటం చాలా ఎర్లీ అయిపోతుంది. నేను ఏం చెప్పినా, చెప్పకపోయినా దాని గురించి వార్తలు రాసేస్తున్నారు. కాబట్టి ఇప్పటినుంచే దాని గురించి మాట్లాడటం కరెక్ట్ కాదు” అంటూ ఆయన దాటవేసే ప్రయత్నం చేశారు. ఆ సినిమా గురించి అలాగే డ్రామా జూనియర్స్ గురించి పలు కీలకమైన విషయాలను ఆయన పంచుకున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఆ వీడియో మీరు కూడా చూసేయండి.