Andhra King Taluka : రామ్ పోతినేని హీరోగా మహేశ్ బాబు పి డైరెక్షన్ లో వస్తున్న ఆంధ్రాకింగ్ తాలూకా సినిమా రిలీజ్ డేట్ ను మార్చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఉపేంద్ర కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో భాగ్య శ్రీ భోర్సే హీరోయిన్ గా చేస్తోంది. నవంబర్ 28న రిలీజ్ చేస్తున్నట్టు గతంలో ప్రకటించారు. అయితే తాజాగా రిలీజ్ డేట్ లో మార్పులు చేస్తూ ఒక రోజు ముందే నవంబర్ 27న రిలీజ్ చేస్తున్నారు. ఈ మేరకు తాజాగా రిలీజ్ పోస్టర్ వదిలారు.
Read Also : Varanasi : వామ్మో.. వారణాసి ఈవెంట్ కు అన్ని కోట్లు పెట్టారా..?
అనుకున్న దాని కంటే ఒక రోజు ముందే రావడంతో రామ్ ఫ్యాన్స్ ఫుల ఖుషీ అవుతున్నారు. రామ్ పోతినేని ఈ మధ్య వరుస ప్లాపులతో సతమతం అవుతున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే ఆశతో ఉన్నాడు. పైగా మూవీ నుంచి వచ్చిన గ్లింప్స్, సాంగ్స్, పోస్టర్లు అంచనాలు పెంచుతున్నాయి. రామ్ ఫస్ట్ టైమ్ ఒక సరికొత్త పాత్రలో కనిపించబోతున్నాడు. పైగా ఈ సారి మైత్రీ నిర్మాణ సంస్థ రంగంలోకి దిగింది కాబట్టి హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి.
Read Also : Pawan Kalyan – Mahesh Babu : మొన్న పవన్ కల్యాణ్.. నేడు మహేశ్ బాబు.. అదే రిపీట్