Pawan Kalyan – Mahesh Babu : పవన్ కల్యాణ్, మహేశ్ బాబు ఎప్పుడైనా సరే తమ సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లకు ఎలా వస్తారు. ఏదో నార్మల్ డ్రెస్ లో వచ్చేస్తారు. అంతే గానీ మూవీకి సంబంధించిన పాత్రల గెటప్ లో అస్సలు రారు. కానీ వీరిద్దరు కూడా రూటు మార్చేశారు. మొన్న పవన్ కల్యాణ్ ఓజీ సినిమా ఫంక్షన్ కు ఎలా వచ్చారో మనం చూశాం కదా. బహుషా ఫస్ట్ టైమ్ అనుకుంట పవన్ కల్యాణ్ పూర్తిగా మూవీ పాత్రలో కనిపించడం. బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుని, కత్తి పట్టుకుని ఎంత హంగామా చేశారో మనం చూశాం. అది పెద్ద ఎత్తున వైరల్ అయింది.
Read Also : I Bomma Ravi : ఐ బొమ్మ రవికి సోషల్ మీడియాలో మద్దతు.. ఇదేం తీరు భయ్యా..?
ఇక మహేశ్ బాబు కూడా నిన్న వారణాసి ఈవెంట్ లో ఇలాంటి గెటప్ లోనే ఎంట్రీ ఇచ్చారు. సాధారణంగా మహేశ్ బాబు ఎప్పుడైనా బులుగు చొక్కా వేసుకుని ఓ ప్యాంట్ వేసుకుని సాదాసీదాగా వచ్చేస్తాడు. కానీ నిన్న రాజమౌళి డిమాండ్ మేరకు రెండు బటన్లు లేని డ్రెస్ వేసుకుని పాత్ర లుక్ లో కనిపించాడు. అంతే కాకుండా ఈవెంట్ లో ఆర్టిఫిషియల్ ఎద్దుపై రావడం ఇంకా థ్రిల్ అనిపించింది. ఇవన్నీ బహుషా రాజమౌళి ఈవెంట్ లోనే మనకు కనిపిస్తాయి కదా. ఇలా పవన్ కల్యాణ్, మహేశ్ బాబు రూటు మార్చడం కూడా వాళ్ల ఫ్యాన్స్ కు బాగానే నచ్చేస్తోంది. ఓజీ పెద్ద హిట్ అయింది. మరి వారణాసి ఏ రేంజ్ హిట్ అవుతుందో చూద్దాం.
Read Also : Trisha : అసహ్యం వేస్తుంది ఫేక్ న్యూస్ ఆపండి – త్రిష సీరియస్ వార్నింగ్