హాట్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక పక్క యాంకరింగ్, మరో పక్క వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది ఇక ఇవన్నీ పక్కన పెడితే అమ్మడు సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటుంది. తనను ట్రోల్ చేసినవారికి ఘాటుగా సమాధానాలు చెప్తూ వారి నోరు మూయిస్తుంది. ఇక కొన్నిసార్లు అమ్మడు హద్దు దాటి ప్రవర్తించిన రోజులు కూడా ఉన్నాయి. ఇద్దరు బిడ్డలా తల్లి అయినా చిట్టిపొట్టి నిక్కర్లు వేసుకొని, హాట్ హాట్ ఫోటోషూట్లు చేస్తూ ఉంటుందని ఇప్పటికి ఆమెను నెటిజన్స్ విమర్శిస్తూనే ఉంటారు. అయితే నా జీవితం నా ఇష్టం.. మీరు చూడండి.. చూడకపోండి అది మీ ఇష్టం అని నిర్మొహమాటంగా ఆన్సర్ ఇచ్చే ఈ హాట్ యాంకరమ్మ తాజాగా తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంది. నిన్న అనసూయ 12 వ వివాహ వార్షికోత్సవం.. ఈ సందర్భంగా ఆమె తన భర్తతో ఉన్న హ్యాపీ మూమెంట్స్ ను వీడియో రూపంలో షేర్ చేస్తూ భర్తకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపింది.
“డియర్ నిక్కు.. మనిద్దరం కలిసి ఉండటమే నాకు ఓ అద్భుత ప్రదేశం. నువ్ నా పక్కనే ఉంటే చాలు ఒక్క చేత్తో ఈ ప్రపంచాన్ని జయించగలను. ఇన్నేళ్ల మన లవ్ జర్నీలో ఎన్నో తీపి జ్ఞాపకాలు, ఎన్నో ఒడిదొడుకులు, మరెన్నో మధుర క్షణాలు. అన్నింటిని మించి నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మన 21 ఏళ్ల కలయికలో పెళ్లై 12 ఏళ్లు గడిచాయి. నా వృద్ధాప్యం వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటా”.. అని చెప్పుకొచ్చింది. ఇక ఈ ఫొటోలో ఒక ఫోటోను మాత్రం నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఇద్దరు పిల్లలు ఉండి ఇలా లిప్ లాక్ ఇస్తూ ఫోటోలకు పోజ్ ఇస్తున్నావ్.. కొద్దిగా హద్దు మీరినట్లు అనిపించడం లేదా అని కొందరు అంటుండగా .. మరికొందరు మాత్రం.. భర్తతో ఏది చేసినా తప్పేమి ఉంది.. ట్రోల్స్ చేయాలన్న మీ ఉద్దేశ్యం తప్ప అందులో ఏ తప్పు కనిపించడం లేదు అంటూ అనసూయకు సపోర్ట్ చేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం అనసూయ దర్జా, వాంటెడ్ పండుగాడ్, గాడ్ ఫాదర్ సినిమాలలో నటిస్తోంది.