Anasuya: బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. టాలీవుడ్, కోలీవుడ్ అని తేడాలేకుండా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు పట్టేస్తోంది. ఇక జబర్దస్త్ ద్వారా మంచి పేరు తెచ్చుకున్న అనసూయ గతేడాది జబర్దస్త్ నుంచి బయటికి వచ్చేసింది. అందుకు కారణంగా.. సినిమాల వలన జబర్దస్త్ కు సమయాన్ని కేటాయించలేకపోతున్నానని, జబర్దస్త్ లో కొన్ని మాటలను తాను తీసుకోలేకపోతున్నట్లు చెప్పుకొచ్చింది. ఇక బయటికి వచ్చాకా కూడా అమ్మడు చాలానే విమర్శలు ఎదుర్కొంది. మొన్నీమధ్యనే ఆంటీ వివాదం ముగిసింది. తనను ఆంటీ అమ్మవారిపై కేసు పెట్టి.. వాళ్ళపై లీగల్ చర్యలు తీసుకున్న అనసూయ తాజాగా మరో ట్విస్ట్ ఇచ్చింది. జబర్దస్త్ కు ఆ ఇద్దరి వలనే గుడ్ బై చెప్పాను అని షాక్ ఇచ్చింది.
Read Also: Microsoft Layoff: రెండు దశాబ్ధాల అనుబంధం.. భారతీయ ఉద్యోగి తొలగింపు.. ఎమోషనల్ పోస్ట్ వైరల్
మొదటి నుంచి అనసూయ పై వల్గర్ జోక్ లు, అడల్ట్ జోకులు ఎవరైనా వేస్తారు అంటే అది హైపర్ ఆది. ఆమె అలా చెప్పగానే ఆది, రామ్ ప్రసాద్ లు అని చెప్తుందేమో అని అభిమానులందరూ షాక్ అయ్యారు. కానీ, ఆ ఇద్దరు తన పిల్లలు అని చెప్పి షాక్ ఇచ్చింది. పిల్లలు పెద్దవారవుతున్నారు.. వారితో టైమ్ స్పెండ్ చేయలేకపోతున్నా.. అందులోనూ రేపు వారు పెద్దగా అయ్యాకా ఈ షోలో నన్ను కించపర్చేలా మాట్లాడినవి విని వారి మనసులు నొచ్చుకుంటాయి. అందుకే జబర్దస్త్ నుంచి బయటికి వచ్చేసా.. అంటూ చెప్పుకొచ్చింది. ఎనిమిదేళ్లుగా జబర్దస్త్ తనకు చాలా మంచి కెరీర్ ఇచ్చిందని.. ఇప్పుడు సినిమాల్లో బిజీ అవడం వల్ల జబర్దస్త్ చేయడం కుదరట్లేదని చెప్పి ఇప్పుడు పిల్లలు అని ప్లేట్ తిప్పేసావ్ ఏంటి అను అంటూ నెటిజన్లు అనసూయను ఆడేసుకుంటున్నారు. ప్రస్తుతం అనసూయ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
Read Also: LIC Jeevan Arogya Policy : ఈ కార్డు ఉంటే.. హాస్పిటల్ బిల్ కట్టే పనేలేదు