Anasuya : యాక్టర్ కమ్ యాంకర్ అయిన అనసూయ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటుంది. తన మీద వచ్చే ట్రోల్స్, నెగెటివ్ కామెంట్స్ మీద ఘాటుగా స్పందిస్తూ ఉంటుంది. తాజాగా తన మీద వస్తున్న ట్రోల్స్ పై ఓ లెటర్ రిలీజ్ చేసింది. ఈ మధ్య నాపై కొందరు లేడీస్ యూట్యూబ్, సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు చేస్తున్నారు. నాపై వచ్చే వీడియోలు, కామెంట్స్ పై చాలా వరకు సైలెంట్ గా ఉంటాను. కానీ ఈ మధ్య మహిళలు నా మీద పర్సనల్ గా వీడియోలు చేయడం తట్టుకోలేకపోతున్నా. వాళ్లు నా గురించి తెలుసుకుంటే బాగుంటుంది.
Read Also : Kingdom : నెపోటిజం తప్పు కాదు.. విజయ్ కామెంట్స్
నేను ఒక తల్లిగా, మహిళగా, భార్యగా అన్ని బాధ్యతలు నిర్వర్తిస్తున్నా. అదే టైమ్ లో నాకు నచ్చినట్టు డ్రెస్సులు వేసుకుంటా. దాంతో మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి. నేను ఒక యాక్టర్ ను. నా డ్రెస్సింగ్ నా స్టైల్, గ్లామర్, కాన్ఫిడెన్స్ ను పెంచుతాయి. ఇవన్నీ నా వ్యక్తిత్వంలో భాగం. నేను తల్లి అయిన తర్వాత ఇలాంటి డ్రెస్సులు వేసుకోవడం అవసరమా అనుకోవచ్చు. కానీ తల్లి అయితే నా వ్యక్తిత్వాన్ని వదులుకోవాలా.
నా ఫ్యామిలీ, నా పిల్లలు నేను ఎలా ఉంటానో అలాగే ప్రేమిస్తారు. వాళ్లు నాకు కంప్లీట్ గా సపోర్ట్ చేస్తున్నారు. నేను పాష్ గా లైఫ్ ను గడిపితే కొందరికి నచ్చకపోవచ్చు. నా డ్రెస్ లను బట్టి నేను విలువలు కోల్పోయానని అనుకోవద్దు. నాలాగా ఉండమని నేను చెప్పట్లేదు. అది నా ఇష్టం. మీకు నచ్చినట్టు మీరు లైఫ్ ను గడపండి. మీ లైఫ్ గురించి నేను తీర్పు ఇవ్వను. కాబట్టి నా మీద కూడా అదే గౌరవాన్ని కలిగి ఉండాలి. మన మధ్య ఉన్న తేడాలను దాడులుగా మార్చకుండా అంగీకరించగలిగితే అందరం హ్యాపీగా జీవించొచ్చు అంటూ చెప్పుకొచ్చింది అనసూయ.
Read Also : Kingdom : కింగ్ డమ్ కోసం విజయ్ షాకింగ్ రెమ్యునరేషన్..
— Anasuya Bharadwaj (@anusuyakhasba) July 30, 2025