Allu Vs Mega : పతాక స్థాయికి ‘మెగా vs అల్లు’ వార్
- పతాక స్థాయికి 'మెగా vs అల్లు' వార్
- చెప్పుకోలేని పదజాలంతో సోషల్ మీడియాలో అల్లు వర్సెస్ మెగా ఫ్యాన్ వార్
- పోటా పోటీ పోస్ట్‌లు- కామెంట్లతో రెచ్చిపోతున్న ఫ్యాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allu Vs Mega Social Media War Going on: ఒక్కోసారి.. చెప్పుకోలేని పదజాలంతో సోషల్ మీడియాలో అల్లు వర్సెస్ మెగా ఫ్యాన్ వార్ జరుగుతోంది. ఇంతకుముందు మెగా ఫ్యాన్స్ ఇతర హీరోల అభిమానులు వాదించుకునే వారు. కానీ నిన్న మొన్నటి వరకు ఒకే ఫ్యామిలీ అని చెప్పుకున్న అల్లు, మెగా ఫ్యాన్సే ఇప్పుడు కొట్టుకుంటున్నారు. దీనంతటికి కారణం.. గతంలో బన్నీ చేసిన చెప్పను బ్రదర్ అనే కామెంట్స్ అనే చెప్పొచ్చు. అక్కడి నుంచి మొదలైన అల్లు, మెగా ముసలం.. ప్రస్తుతం పీక్స్ స్టేజీకి చేరుకుంది. ఇటీవల జరిగిన ఏపి ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి మద్దతుగా బన్నీ నంద్యాల వెళ్లడంతో.. అల్లు, మెగా ఫ్యామిలీ మధ్య విభేదాలు నిజమనేలా చేశాయి. దీనిపై నాగబాబు రియాక్ట్ అవుతూ.. ప్రత్యర్థుల కోసం పనిచేసేవాడుమా వాడైన పరాయి వాడే.. అనే పోస్ట్ మరింత ఆజ్యం పోసింది. సాయిధరమ్ తేజ్ అయితే.. ఏకంగా అల్లు అర్జున్ను ట్విట్టర్లో అన్ ఫాలో కొట్టాడు. ఇక ఎన్నికల్లో పవన్ గెలిచిన తర్వాత, ఇటీవల మాట్లాడుతూ.. అప్పట్లో హీరోలు అడవులను కాపాడితే, ఇప్పుడు స్మగ్లింగ్ చేస్తున్నారని అన్నారు. ఇక ఇప్పుడు బన్నీ చేసిన కామెంట్స్ పెద్ద దుమారాన్నే రేపాయి.
Raviteja: హీరో రవితేజకు గాయం..శస్త్ర చికిత్స
Also Read
- Viswanath and Sons : అనిల్ రావిపూడి తరహాలో వెంకీ అట్లూరి... ఫస్ట్ సింగిల్ అనౌన్స్మెంట్ తోనే ప్రమోషన్స్ షురూ....
- Anandita Surgery Rumours : అలాంటి సర్జరీలు చేయించుకోలేదు... ట్రోలర్స్ పై మండిపడ్డ ఖుష్బూ కూతురు
- Dhurandhar: 'ధురంధర్’ స్క్రిప్ట్ పీఎంఓ నుంచి వచ్చిందా?.. నటుడు కీలక వ్యాఖ్యలు.!
- Fahadh Faasil : 'దృశ్యం 3' నిర్మాతలతో ఫహద్ ఫాసిల్ క్రేజీ డీల్... వరుస ప్రాజెక్టులు
మారుతీ నగర్ సుబ్రమణ్యం సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో.. అల్లుఅర్జున్ ఇండైరెక్ట్‌గా పవన్‌కు కౌంటర్ ఇచ్చినట్టుగా మాట్లాడానేది చర్చకు దారి తీసింది. మన ఫ్రెండ్ అనుకో.. కావాల్సిన వాళ్లనుకో.. నాకిష్టమైతే నేనొస్తా.. నా మనసుకు నచ్చితేనే వస్తా.. అన్నాడు. అంటే.. బన్నీ ఇష్టమనే లిస్ట్‌లో పవన్ లేరా? అనే సందేహాలు ఇక్కడ వెలువడుతున్నాయి. అందులోను.. ‘మై డియర్ ఫ్యాన్స్.. మీరే నా ఆర్మీ, నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి.. హీరోని చూసి చాలామంది ఫ్యాన్స్ అవుతారు, కానీ నేను నా ఫ్యాన్స్‌ని చూసి హీరోనయ్యా.. అంటూ కామెంట్ చేశాడు. ఈ వీడిడయోని అల్లు ఫ్యాన్స్ తెగ వైరల్ చేశారు. దీనికి కౌంటర్‌గా మెగా ఫ్యాన్స్.. ఏకంగా ఇంద్ర సినిమా రీ రిలీజ్లో రచ్చ చేశారు. ఈ సినిమాలో నటుడు శివాజీ సీన్ వచ్చినప్పుడు.. అతన్ని ఉద్దేశించి అల్లు అర్జున్ అంటు మెగా ఫ్యాన్స్ ఆ వీడియోలను వైరల్ చేశారు. అయితే.. సోషల్ మీడియాలో ఇంత జరుగుతున్నప్పటికీ.. మెగా, అల్లు కాంపౌండ్స్ నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు కదా.. సమయం వచ్చినప్పుడల్లా ఫ్యాన్స్ మధ్య కొట్లాటకు దారి తీసేలా కామెంట్స్ చేస్తుండడం గమనార్హం. ఇలా రోజు రోజుకి మెగా, అల్లు ఫ్యామిలీతో పాటు.. అభిమానుల మధ్య మాటల యుద్ధం పెరుగుతునే ఉంది. పోటా పోటీ పోస్ట్‌లు, కామెంట్లతో రెచ్చిపోతునే ఉన్నారు. మరి దీనికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Naresh Gujral: మాజీ ప్రధాని కుమారుడికి రూ.7.8 కోట్ల సైబర్ మోసం.. వాట్సాప్ మెసేజ్ తో కొల్లకొగొట్టేసారు.!
-
OnePlus Pad 3 Pro: వన్‌ప్లస్ ప్యాడ్ 3 ప్రో టాబ్లెట్ విడుదల.. 13,380mAh బ్యాటరీ, 16GB RAM
-
BCCI: క్రికెట్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. IPL 2027 షెడ్యూల్‌పై బీసీసీఐ సంచలన నిర్ణయం
-
Viswanath and Sons : అనిల్ రావిపూడి తరహాలో వెంకీ అట్లూరి… ఫస్ట్ సింగిల్ అనౌన్స్మెంట్ తోనే ప్రమోషన్స్ షురూ….
ట్రెండింగ్
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..
-
Shubman Gill: డబుల్ సెంచరీపై కన్నేశా కానీ.. టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kitchen Tips : చపాతీ ఎక్కువ సేపు మెత్తగా ఉండాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి.!
-
Chicken Bones : చికెన్ తిన్నాక ఎముకలను పారేస్తున్నారా.? వాటితో ఎన్నో ప్రయోజనాలు.!
-
Hair Care Tips : జుట్టు త్వరగా జిడ్డుగా మారుతోందా? ఈ సింపుల్ టిప్స్‌తో రోజంతా ఫ్రెష్‌గా!