‘పుష్ప’రాజ్ కు మరో బ్రేక్… ‘అన్‌స్టాపబుల్’ ఎపిసోడ్ వాయిదా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ టాక్ షో ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ వీక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టుకుంటోంది. ఒక ఎపిసోడ్ అయిపోగానే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ప్రేక్షకులను ఆతృతగా ఎదురు చూసేలా చేస్తోంది బాలయ్య హోస్టింగ్ నైపుణ్యం. ఈ ప్రముఖ టాక్ షో తాజా ఎపిసోడ్ లో బాలయ్యతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందడి చేయబోతున్నట్టుగా మేకర్స్ ఇటీవల ప్రకటించారు. ఆ ఎపిసోడ్ డిసెంబర్ 25న అంటే రేపు ప్రసారం కావాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఈ షోలో అల్లు అర్జున్ ఎపిసోడ్ అనుకోని కారణాల వల్ల వాయిదా పడినట్టు సమాచారం. అల్లు అర్జున్ “పుష్ప ది రైజ్” బృందం ఈ క్రిస్మస్‌కు ప్రత్యేక ఎపిసోడ్ కోసం ప్రేక్షకులను అలరిస్తుందని ఆశిస్తున్నా ఆయన అభిమానులకు తాజాగా షో నిర్వాహకులు చేసిన అనౌన్స్మెంట్ తో నిరాశ తప్పలేదు.
“అన్‌స్టాపబుల్ వినోదం కొనసాగుతుంది… కానీ చిన్న విరామంతో! ఊహించని పరిస్థితుల కారణంగా #UnstoppableWithNBK షోలో అందరూ అత్యంత ఆతృతగా ఎదురు చూస్తున్న ‘పుష్ప’ స్పెషల్ ఎపిసోడ్ రేపు విడుదల కాదని తెలియజేయడానికి చింతిస్తున్నాము. మీకు బెస్ట్ అందించడానికి మాత్రమే ఆలస్యం జరుగుతోంది. మేము మీకు ఖచ్చితంగా బెస్ట్ అందిస్తామని హామీ ఇస్తున్నాము!” అంటూ మేకర్స్ క్రిస్మస్ కానుకగా విడుదలవుతుంది అనుకున్న ఎపిసోడ్ వాయిదాపై వివరణ ఇచ్చారు. అల్లు అర్జున్ ఎపిసోడ్ 6 కాగా, నెక్స్ట్ ఎపిసోడ్ లో రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేని కనిపించబోతున్నారు. ఇక ఇప్పటికే ఈరోజు కాకినాడలో జరగాల్సిన వేడుకకు అధికారుల నుంచి అనుమతి నిరాకరణ ఎదురవ్వడంతో బ్రేక్ పడిన విషయం తెలిసిందే.
Also Read
Unstoppable entertainment will continue, but with a small break!
We regret to inform that due to unforeseen circumstances the most awaited Pushpa Special episode of #UnstoppableWithNBK will not be releasing tomorrow.
We assure you that the delay is only to give you the best!
— ahavideoin (@ahavideoIN) December 24, 2021
తాజావార్తలు
-
New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్‌ప్లే, USB-C ఛార్జింగ్తో కొత్త ఫీచర్లు!
-
Aafiya Sayed : టాలీవుడ్లోకి బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఇంట్రడ్యూస్
-
Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!