Allu Arjun: అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తున్న విషయం విదితమే. ఈ సినిమా మేకోవర్ లో బిజీగా ఉన్న బన్నీ కొన్నిరోజులుగా ఫ్యామిలీ మ్యాన్ గా మారిపోయాడు. కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తున్న బన్నీ తాజాగా గణేష్ నిమజ్జన వేడుకల్లోపాల్గొన్నారు. తనతో పాటు కూతురు అర్హను కూడా ఈ వేడుకల్లో భాగం చేశాడు. బన్నీ కి అర్హ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఇక అర్హకు సోషల్ మీడియాలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మాములుగా ఉండదు. ఈ తండ్రి కూతుళ్లు కలిసి కనిపించినప్పుడల్లా అభిమానులు పండగ చేసుకుంటూ ఉంటారు. ఇక కారులో గీతా ఆర్ట్స్ వద్దకు వచ్చిన బన్నీ వినాయకుడిని నిమజ్జనానికి పంపుతూ రోడ్డుపై చిందులు వేశారు. అర్హను బండిపై కూడా డాన్స్ వేయించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక బ్లాక్ డ్రెస్ లో అల్లు అర్జున్ పుష్ప లుక్ లో కనిపించగా పింక్ కలర్ గౌన్ లో అల్లు అర్హ ఎంతో ముద్దుగా కనిపించింది. వినాయకుడిని ఉరేగించేవరకు అక్కడే ఉన్న బన్నీ.. నిమజ్జనం తర్వాత ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా దారి పొడవునా అల్లు అర్జున్ ఫ్యాన్స్ సందడి చేస్తూ ఆయన వాహనాన్ని అనుసరించారు.
Icon Staar @alluarjun & #AlluArha bid adieu to Lord Ganesh. #GaneshChaturthi2022 #GaneshVisarjan pic.twitter.com/xHBqJdmKF3
— Sarath Chandra Naidu (@imsarathchandra) September 5, 2022