Waltair Veerayya: మెగా- అల్లు కుటుంబాల మధ్య విబేధాలు ఉన్నాయంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా కోడై కూస్తోంది. మెగా ఫ్యామిలీ నుంచి బన్నీ బయటికి రావాలని చాలా కాలం నుంచి చూస్తున్నాడని ఆ వార్తల సమాచారం. అయితే ఈ విభేదాల గురించి ఇప్పటికే అల్లు అరవింద్, చిరంజీవి క్లారిటీ కూడా ఇచ్చేశారు. అందరు సినిమాల పరంగా పోటీ పడుతుంటారేమో కానీ, మెగా కజిన్స్ ఎప్పుడు ఒక్కటిగానే ఉంటారని చిరంజీవి చెప్పుకు రాగా.. బయట తామంటే గిట్టనివారు ఇలా పుకార్లు సృష్టిస్తున్నారని, తామెప్పుడు కలిసే ఉంటామని అల్లు అరవింద్ చెప్పుకొచ్చాడు. ఇక తండ్రి చెప్పిన మాటలను బన్నీ నెరవేర్చడానికి ప్రయత్నిస్తున్నాడు. అంతకు ముందు మెగా కజిన్స్ పార్టీలో అల్లు అర్జున్ మిస్ అయ్యి కనిపించాడు. ఈ విబేధాల పుకార్లు రావడంతో మరోసారి మెగా కజిన్స్ పార్టీలలో అల్లు బ్రదర్స్ మెరిశారు.
ఇక మెగా- అల్లు వారి కుటుంబాల మధ్య విభేదాలు లేవని చూపించడానికే నేడు వాల్తేరు వీరయ్య సినిమాను అల్లు అర్జున్ వీక్షించినట్లు నెటిజన్లు చెప్పుకొస్తున్నారు. సాధారణంగా బన్నీ, మెగా మూవీస్ ను ఎప్పుడు మిస్ అవ్వడు. టైమ్ చూసుకొని మరీమెగా ఫ్యామిలీ హీరోలు చేసిన సినిమాలతో పాటు హిట్ అయిన సినిమాలు కూడా చూస్తూ ఉంటాడు. అయితే వీరయ్య రిలీజైన మొదటి రోజే బన్నీ సినిమా చూడడం ఆశ్చర్యంగా ఉందని నెటిజన్లు అంటున్నారు. ప్రసాద్ మల్టీప్లెక్స్ లో నేడు అల్లు అర్జున్ వాల్తేరు వీరయ్య సినిమా వీక్షించినట్లు తెలుస్తోంది. సినిమా బావుందని బన్నీ చెప్పుకొచ్చాడు. మెగా ఫ్యాన్స్ మధ్య కూర్చొని బన్నీ సినిమా చూసాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.