Gaddar Awards : తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న గద్దర్ అవార్డుల వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఇందులో బెస్ట్ యాక్టర్ గా అల్లు అర్జున్న గద్దర్ అవార్డును అందుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, దిల్ రాజు ఈ అవార్డును అందజేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. పుష్ప-2 సినిమాకు గాను ఆయన ఈ అవార్డు అందుకున్నారు.
Read Also : Gaddar Awards Sets : గద్దర్ అవార్డు సెట్ అదిరింది..
ఇప్పటికే పుష్ప-1 కు గాను నేషనల్ బెస్ట్ యాక్టర్ గా అవార్డు అందుకున్నాడు బన్నీ. ఇప్పుడు రెండో పార్టుకు రాష్ట్ర అవార్డు అందుకున్నాడు. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తనకు ఈ అవార్డు ఇచ్చిన వారికి బన్నీ థాంక్స్ చెప్పాడు. తన డైరెక్టర్ సుకుమార్ వల్లే ఇదిసాధ్యం అయిందని చెప్పుకొచ్చాడు. ఆయనకు స్పెషల్ థాంక్స్ చెప్పాడు. అలాగే తనకు సహకరించిన నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపాడు.
Read Also : Allu Arjun: అల్లు అర్జున్ ను హగ్ చేసుకున్న సీఎం రేవంత్