Site icon NTV Telugu

Allu Arjun : తెలుగు సినిమా వెలుగుతోంది.. బన్నీ సంతోషం..

Allu Arjun

Allu Arjun

Allu Arjun : 71వ జాతీయ అవార్డులపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంతోషం వ్యక్తం చేశారు. తెలుగు సినిమా వెలుగుతోందని స్పెషల్ ట్వీట్ చేశారు. షారుక్ ఖాన్ కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు రావడం నిజంగా సంతోషంగా ఉంది. ఆయన ఈ అవార్డుకు నిజంగా అర్హులు. 33 ఏళ్లుగా సినిమాలు చేస్తున్న షారుక్.. ఈ అవార్డుతో మరో మెట్టు ఎక్కారు అంటూ విషెస్ తెలిపాడు బన్నీ. అటు 12 ఫెయిల్ తో నేషనల్ అవార్డు అందుకున్న విక్రాంత్ మాసేకు స్పెషల్ ట్వీట్ చేసి విషెస్ చెప్పాడు అల్లు అర్జున్. ఇటు తెలుగు నాట అవార్డులు అందుకున్న వారికి ప్రత్యేకంగా ట్వీట్లు చేసి విషెస్ తెలిపాడు. బెస్ట్ తెలుగు ఫిల్మ్ అవార్డు అందుకున్న భగవంత్ కేసరి టీమ్ కు విషెస్ చెప్పాడు.

Read Also : Operation Akhal: కుక్క చావు చచ్చారు.. ముగ్గురు లష్కరే ఉగ్రవాదుల హతం..

బాలకృష్ణ గారు, అనిల్ రావిపూడికి ప్రత్యేకంగా అభినందనలు. ఈ అవార్డు మీరు అందుకోవడం సంతోషంగా ఉంది. అలాగే చైల్డ్ ఆర్టిస్టుగా అవార్డు అందుకున్న డియర్ సుకృతికి స్పెషల్ విషెస్. ఇది మా అందరికీ గర్వకారణం. ప్రత్యేకించి మీ నాన్న సుకుమార్ గారికి ఇది ఎంతో గర్వకారణమైన రోజు. ప్రశాంత్ వర్మకు, కాసర్ల శ్యామ్ కు నా బెస్ట్ విషెస్. తెలుగు సినిమాలకు ఇన్ని అవార్డులు రావడం సంతోషంగా అనిపిస్తోంది. తెలుగు సినిమా వెలుగుతోంది. రానున్న రోజుల్లో మరిన్ని అవార్డులు తెలుగు ఇండస్ట్రీ అందుకోవాలని ఆశిస్తున్నాను అంటూ రాసుకొచ్చాడు అల్లు అర్జున్. ఆయన చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. పుష్ప-1 సినిమాకు గాను అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే.

Read Also : Kingdom : ఇంతకీ కింగ్ డమ్ హిట్టా కాదా..?

Exit mobile version