Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. రెండేళ్లుగా ఈ సినిమా కోసం అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. గతేడాది రిలీజ్ అవుతుందేమో అని ఎంతగానో ఎదురుచూసిన అభిమానులకు నిరాశ తప్పలేదు. ఇక ఈ ఏడాది అయినా పుష్ప 2 రిలీజ్ అవుతుంది అని ఆశతో ఉన్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. సినిమా విషయం పక్కనపెడితే.. అభిమానులను బన్నీ ఈ మాత్రం నిరాశ పర్చడం లేదు. సినిమా అప్డేట్స్ లేకపోయినా.. ఎప్పటికప్పుడు బన్నీ కొత్త లుక్ తో అలరిస్తూనే ఉన్నాడు. తాజాగా బన్నీ న్యూ లుక్ సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
డైరెక్టర్ సుకుమార్ భార్య తబితా సుకుమార్.. అల్లు అర్జున్ తో కలిసి దిగిన ఒక ఫోటోను షేర్ చేసింది. అందులో బన్నీని చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. ఫుల్ గడ్డం, జుట్టుతో పుష్ప 2 గెటప్ లోనే ఉన్నాడు. సడెన్ గా చూసి సుకుమార్ అనుకోవడంలో ఆశ్చర్యం లేదు. సుకుమార్ కూడా అలాగే గడ్డంతో ఉండడంతో అభిమానులు షాక్ అవుతున్నారు. సడెన్ గా చూసి సుకుమార్ అనుకున్నాం కదా మావా.. బన్నీనా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే బన్నీ ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ తో ఒక సినిమా చేస్తున్నాడు. మరి ఈ సినిమాలతో అల్లు అర్జున్ ఎలాంటి విజయాలను అందుకుంటాడో చూడాలి.