Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. పుష్పకు జాతీయ అవార్డు రావడంతో బన్నీ రేంజ్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది. అంతేనా పుష్ప 2 పై అంచనాలు ఆకాశానికి తాకాయి. ఇక ఈ సినిమాప్ దాదాపు వెయ్యి కోట్లు బిజినెస్ జరుగుతుందని టాక్. ఇక ఈ సినిమా తరువాత బన్నీ.. త్రివిక్రమ్ కాంబోలో ఒక సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ కాంబోలో మూడు హిట్ సినిమాలు వచ్చాయి. దీంతో నాలుగోసారి కూడా ఈ కాంబో హిట్ అందుకుంటుందని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. ఇవన్నీ పక్కన పెడితే.. బన్నీకి తెలుగులోనే కాదు మిగతా అన్ని భాషల్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారన్న విషయం తెల్సిందే. ముఖ్యంగా కోలీవుడ్, మాలీవుడ్ ల్లో అయితే బన్నీకి సపరేట్ ఫ్యాన్స్ క్లబే ఉంది. ఇక దీంతో బన్నీని ఆయా భాషల్లో ఎంట్రీ ఇవ్వాలని అభిమానులు కోరుతూనే ఉన్నారు. కానీ, మంచి కథ కోసం బన్నీ ఎదురుచూస్తున్నాడు.
Weapon: ‘వెపన్’ – గ్లింప్స్ రిలీజ్.. సూపర్ హ్యూమన్ గా సత్యరాజ్
ఇక అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రస్తుతం బన్నీ చుట్టూ ఒక కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కథ పట్టుకొని తిరుగుతున్నాడని టాక్ నడుస్తోంది. అతను ఎవరో కాదు.. అట్లీ. రాజారాణి సినిమాతో వెనక్కి తిరిగి చూసుకొనవసరం లేని హిట్ ను అందుకొని.. విజయ్ తో వరుసగా మూడు సినిమాలు చేసి హిట్ అందుకున్న అట్లీ.. బాలీవుడ్ లో జవాన్ తో స్ట్రాంగ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నే డైరెక్ట్ చెస్ అవకాశాన్ని అందుకున్నాడు. మరో రెండు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ లోకి కూడా గ్రాండ్ ఎంట్రీ కోసం ప్రయత్నాలు చేస్తూ.. బన్నీకి మంచి కథ ఉందని.. వినాలని కోరినట్లు సమాచారం. ఇది కనుక ఓకే అయితే ఐకాన్ స్టార్ కోలీవుడ్ ఎంట్రీ.. జవాన్ డైరెక్టర్ తో.. అయ్యినట్టే.. మరి ఇందులో ఎంత నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది.