Pushpa 2 Shooting Update:పుష్ప సినిమాతో పాన్ ఇండియా వైడ్ క్రేజ్ తెచ్చుకున్న బన్నీ, సుకుమార్ రెండో పార్ట్ మీద ప్రాణం పెట్టి పని చేస్తున్నారు. స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మారిన అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న హిట్ సీక్వెల్ పుష్ప 2 ది రూల్ సినిమాపై భారీ అంచనాలున్నాయి. నిజానికి పుష్ప మూవీ రిలీజ్ అయి రెండేళ్లు కావొస్తుంది అయినా ఈ రెండవ భాగాన్ని జక్కన్నలా మారి చెక్కుతునే ఉన్నాడు సుకుమార్. పెరిగిన పాన్ ఇండియా అంచనాలకు తగ్గట్లుగా స్క్రిప్ట్ కోసం చాలా సమయం తీసుకున్న సుకుమార్ బడ్జెట్ విషయంలో కూడా ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. మొదటి భాగంలో నిర్మాణం చేసిన ముత్తంశెట్టి మీడియా వర్క్స్(బన్నీ మేనమామ బ్యానర్)ను పక్కన పెట్టి దీనికోసమే కొత్త బ్యానర్ రిజిస్ట్రేషన్ చేయించి నిర్మాణ భాగస్వామి కూడా అయ్యాడు ఆయన. ఈ క్రంమలోనే దాదాపు 350 కోట్ల భారీ బడ్జెట్‌తో పుష్ప2ని గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నాడు.
Tamannaah Bhatia Pics: అసలే మిల్కి బ్యూటీ.. అందులోనూ సూపర్ శారీ! తమన్నా లేటెస్ట్ పిక్స్ వైరల్
ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ పై ఉంది. అయితే ఇప్పటికే లేట్ అయింది కదా అని ఆదరాబాదరా స్పీడ్‌గా షూటింగ్ కంప్లీట్ చేయాలనే ఆలోచనలో లేడట సుకుమార్. అనుకున్న ఔట్‌పుట్ కోసం తగ్గేదేలే అంటున్నారట అటు బన్నీ బన్నీ, ఇటు సుక్కు. రీసెంట్‌గా సుకుమార్, బన్నీ విదేశాలకు వెళ్లడంతో షూటింగ్‌కు కాస్త బ్రేక్ పడింది. దీంతో ఈ మధ్య పుష్పరాజ్ యవ్వారం సైలెంట్ అయింది. ఇక తాజాగా పుష్ప 2 కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. ఈ కొత్త షెడ్యూల్ హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతున్నట్టు చెబుతున్నార. అల్లు అర్జున్‌తో పాటు కీలక నటీనటులపై వచ్చే సన్నివేశాలను లేటెస్ట్ షెడ్యూల్‌లో షూట్ చేస్తున్నారట యూనిట్ సభ్యులు. దీంతో మళ్లీ పుష్పరాజ్ డ్యూటీ ఎక్కేశాడు, ఇక ఈసారి తగ్గేదేలే అంటున్నారు ఆయన అభిమానులు. వీలైనంత వేగంగా షూటింగ్ కంప్లీట్ చేసి.. సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతికి కష్టం కానీ అన్నీ సరిగ్గా కుదిరితే.. వచ్చే సమ్మర్ కానుకగా ఏప్రిల్‌లో పుష్ప2 రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు, చూడాలి మరి ఏమవుతుందో?