“పుష్ప, పుష్ప రాజ్ భాషలో మీతో మాట్లాడాల్సి వస్తే… ఏందబ్బా ఎట్లా ఉండరు… శానా దినలైనాది మిమ్మల్ని కలిసి… ఎంది రచ్చ… ఆపొద్దు తగ్గేదే లే… నేను సరదాగా అంటూ ఉంటాను అందరికీ ఫ్యాన్స్ ఉన్నారు, నాకు మాత్రం ఆర్మీ ఉంది. నేను లైఫ్ లో ఏదైనా సంపాదించుకున్న అంటే అది మీరు మీ ప్రేమ.. నాకు అంతకంటే ఎక్కువ ఏమీ ఇంపార్టెంట్ కాదు… మా గెస్ట్ లుగా వచ్చిన రాజమౌళి, మారుతి, బుచ్చిబాబు మిగతా అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.
దేవిశ్రీ ప్రసాద్ నాకు అద్భుతమైన ఆల్బం ఇచ్చాడు. థాంక్యూ… సామీ సామీ సాంగ్ నాకు పర్సనల్ గా నచ్చింది. ప్రతి సాంగ్ అద్భుతంగా ఉంది. ఫాస్టెస్ట్ మూవ్ అఫ్ సౌత్ ఇండియా అంటే మామూలు విషయం కాదు… సాంగ్ ‘ఊ అంటావా మామ’ హైలెట్. సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం కూడా ఇంకా కష్టపడుతున్నావ్. లాస్ట్ మినిట్ లో చిన్న చిన్న విషయాలకు కూడా నువ్వు కేర్ తీసుకొని ఫంక్షన్ కు రాలేకపోయావు అంటే నేను అర్థం చేసుకోగలను. ఈ ఆల్బమ్ విషయానికి వస్తే మర్చిపోకుండా మాట్లాడాల్సింది చంద్రబోస్ గురించి. సినిమాలు ఒక హీరోయిజం, సింపుల్ లవ్, ఐటెం సాంగ్ ఒకే జనరల్ లో ఎన్ని సినిమాలు… మీరు మొదటి సినిమా నుంచి రాస్తున్నారు. మీరు ఎంటర్ టైన్ మెంట్ గురించి రాయడం మొదలు పెట్టి స్పూర్తిగా తీసుకునేలా ఎదిగారు థాంక్స్. ఈ సినిమా నాలుగు సినిమాల కష్టం.
రష్మిక నేషనల్ క్రష్… నా మనసుకు నచ్చిన అమ్మాయి… ఆమె ఎక్కడో ఉండాల్సిన నటి. ఇక సమంత కు స్పెషల్ థాంక్స్ చెప్పాలి. ఇలాంటి స్పెషల్ సాంగ్ లో కొన్ని కొన్ని చేయమంటారు. కానీ సమంత మాత్రం నేను ఏమి అడిగినా కాదనకుండా చేసింది. ఇక తెరపై సాంగ్ ఉంటది స్వామి… చూడాల్సిందే” అంటూ సమంత, రష్మీకను ఆకాశానికెత్తేశారు.