ఈ సంక్రాంతికి మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. డివైడ్ టాక్‌తో బాక్సాఫీస్ దగ్గర రమణ గాడి ర్యాంపేజ్ చూపించాడు మహేష్ బాబు. ఇక ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ఏంటనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. అయితే… ఇప్పటికే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు త్రివిక్రమ్. ప్రజెంట్ పుష్ప2తో బిజీగా ఉన్నాడు అల్లు అర్జున్. దీంతో మధ్యలో త్రివిక్రమ్ మరో సినిమా చేసే ఛాన్స్ ఉందని వినిపించింది. పవన్ కళ్యాణ్‌తో కూడా మరోసారి సినిమా చేసే ఛాన్స్ ఉందని వినిపించింది కానీ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం… నెక్స్ట్ బన్నీ ప్రాజెక్ట్‌నే సెట్స్ పైకి తీసుకెళ్లడానికి రెడీ అవుతున్నాడట త్రివిక్రమ్.
ఆగష్టు 15న పుష్ప 2 రిలీజ్ కాబోతుంది. ఎట్టిపరిస్థితుల్లోను… వాయిదా పడకుండా ఇదే డేట్‌కు రావాలని ఫిక్స్ అయిపోయాడు పుష్పరాజ్. దీంతో… సెప్టెంబర్‌లో త్రివిక్రమ్ సినిమాను స్టార్ట్ చేయడానికి ముహూర్తం ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. ఈలోపు త్రివిక్రమ్ పవర్ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసుకోనున్నాడట. గతంలో అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో వంటి సూపర్ హిట్ సినిమాలొచ్చాయి. దీంతో అప్ కమింగ్ ప్రాజక్ట్ పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాతోనే త్రివిక్రమ్ పాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించనున్నారట. ఈ చిత్రాన్ని హరికా అండ్ హాసినీ క్రియేషన్స్‌తో పాటు గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించే అవకాశాలున్నాయి. మరి నాలుగోసారి బన్నీ, త్రివిక్రమ్ ఏం చేస్తారో చూడాలి.