Alia Bhatt: బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తెలుగులో ఆర్ఆర్ఆర్ సినిమాతో పరిచయమైన బ్యూటీ ఇటీవలే ప్రేమించిన రణబీర్ కపూర్ ను వివాహమాడి కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది. ఇక పెళ్లి అయిన రెండు నెలలకే తాను ప్రెగ్నెంట్ అని ప్రకటించి షాక్ ఇచ్చింది. దీంతో బాలీవుడ్ మీడియా అలియాను విమర్శించింది. పెళ్ళికి ముందే అలియా- రణబీర్ తప్పు చేసారని, అందుకే త్వరగా వివాహం చేసుకున్నట్లు రాసుకొచ్చారు. అంతేకాకుండా అప్పుడే అలియా తల్లి కావడానికి ఎలా ఒప్పుకొంది అంటూ నెటిజన్లు కామెంట్స్ పెట్టుకొచ్చారు. అయితే ఇప్పటివరకు ఈ వార్తలపై స్పందించని అలియా మొట్టమొదటిసారి ట్రోలర్స్ కు గట్టి కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న డార్లింగ్స్ చిత్రం విడుదలకు సిద్దమవుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్రబృందం.. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా మారింది.
ఇక ఒక ఇంటర్వ్యూలో అలియాకు ఇదే ప్రశ్న ఎదురైంది. మీ గర్భంపై ఎన్నో ట్రోల్ల్స్ వచ్చాయి వాటిపై మీ అభిప్రాయం ఏంటి..? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు హీరోయిన్ మాట్లాడుతూ “ప్రస్తుత కాలంలో మహిళా ఏం పనిచేస్తున్నా అందరి కళ్ళు వారిపైనే ఉంటాయి. అందరూ అనుమానించేవారే.. ఆమె తల్లి కాబోతున్నా, స్నేహితులతో బయటికి వెళ్తున్నా.. క్రికెట్ మ్యాచ్ కు వెళ్లినా.. వారినే చూస్తూ ఉంటారు. అందుకే అలాంటివాటిని పట్టించుకోవడం మానేశాను. ఇక ఇంత చిన్న వయస్సులో తల్లి కావడం.. నా వ్యక్తిగతం. నాకు పర్సనల్ లైఫ్ ను ప్రొఫెషనల్ లైఫ్ ను బ్యాలెన్స్ చేసుకోవడం తెలుసు. కొన్ని కొన్ని గొప్ప విషయాలను ఎవరూ ప్లాన్ చేయరు.. అవి జరిగిపోతూ ఉంటాయి అంతే..” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుత ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.