Ali: టాలీవుడ్ కమెడియన్ ఆలీ- పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న స్నేహ బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే రాజకీయాల వలన ఈ ఇద్దరు స్నేహితులు విడిపోయారు. ఇక మూడు రోజుల క్రితం ఆలీ పెద్ద కూతురు ఫాతిమా వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెల్సిందే. ఈ వివాహానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఇక ఈ పెళ్ళికి పవన్ కళ్యాణ్ హాజరు కాకపోవడం హాట్ టాపిక్ గా మారింది. ఆలీ, పవన్ ను పిలవడానికి వెళ్లినా ఆయన పట్టించుకోలేదని కొందరు, అసలు ఆలీ, పవన్ ను పిలవలేదని కొందరు చెప్పుకొచ్చారు. అయితే తాజాగా ఈ విషయమై క్లారిటీ ఇచ్చాడు. ఒక ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆలీ మాట్లాడుతూ.. “నా కూతురు పెళ్ళికి పవన్ ను పిలిచాను.
రామోజీ ఫిల్మ్ సిటీలో ఆయన షూటింగ్ చేస్తున్నారు అని తెలుసుకొని వెళ్ళాను. అక్కడ ఉన్నవారందరికి వెడ్డింగ్ కార్డులను కూడా ఇచ్చి రమ్మన్నాను. ఇక పవన్ కూడా తప్పకుండా వస్తాను అని చెప్పారు. కానీ, పెళ్లి రోజు ఆయన ఫ్లైట్ క్యాన్సిల్ కావడంతో పవన్ రాలేకపోయారు. ఆ తరువాత పవన్, నాకు ఫోన్ చేసి రాలేకపోతున్నాను. కూతురు, అల్లుడు ఇంట్లో ఉన్నప్పుడు చెప్పు.. నేరుగా ఇంటికి వచ్చి కలుస్తానని చెప్పారని చెప్పుకొచ్చాడు. దీంతో త్వరలోనే ఆలీ ఇంటికి పవన్ వెళ్లనున్నారు. మరి పాత మిత్రులు ఎప్పుడు కలుస్తారో చూడాలి.