కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన చిత్రం ‘సూరారై పొట్రు’. ఈ సినిమా తెలుగులోనూ ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో డబ్ అయ్యింది. కరోనా కారణంగా థియేటర్లలో కాకుండా ఓటీటీలో విడుదలైన ఈ సినిమాకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఆ మధ్య ఈ చిత్రాన్ని దర్శకురాలు సుధ కొంగర తోనే హిందీలోనూ రీమేక్ చేస్తున్నట్టు సూర్య ప్రకటించారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ హిందీలో మొదలైంది. తమిళంలో సూర్య పోషించిన ఎయిర్ డెక్కన్ అధినేత…