ప్రముఖ యాంకర్ సుమ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘జయమ్మ పంచాయితీ. విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మే 6 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందించడం విశేషం. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్ల వేగాన్ని పెంచేశారు మేకర్స్ .. ఈ ప్రమోషన్లో భాగంగా నేడు హైదరాబాద్ లోని దస్పెల్లా హోటల్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు.
ఇక ఈ ఈవెంట్ కు టాలీవుడ్ స్టార్ హీరోలు కింగ్ నాగార్జున, న్యాచురల్ స్టార్ నాని ముఖ్య అతిధులుగా విచ్చేశారు. ఇక ఈ ఈవెంట్ లో నాగార్జున మాట్లాడుతూ.. “ఇదొక పండగలా ఉంది.. ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లా అయితే లేదు.. ఒక పండగలా కనిపిస్తుంది. ఏదో పంచాయితీ పెడుతుందని రాలేదు.. సుమ పిలిచిందని ప్రేమతో వచ్చాను. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతిఒక్కరికి థాంక్స్.. డైరెక్టర్ కానీ, మిగతా టెక్నీషియన్స్ కానీ సుమలో ఉన్న టాలెంట్ ను ఒక 10 పర్సెంట్ మీరు పెట్టినా మీరు మంచి విజయాన్ని అందుకుంటారు. ఈ సినిమా మంచి విజయం సాధించి, సుమకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు.