యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కస్టడీ’. తెలుగు తమిళ భాషల్లో ఈ మూవీని వెంకట్ ప్రభు డైరెక్ట్ చేస్తున్నాడు. స్క్రీన్ ప్లే మాస్టర్ గా పేరున్న ఈ దర్శకుడితో సినిమా అనగానే నాగ చైతన్య కోలీవుడ్ లో కూడా హిట్ అందుకోవడం గ్యారెంటీ అనే నమ్మకం అందరిలోనూ కలిగింది. అ నమ్మకాన్ని నిజం చేస్తూ, కస్టడీ సినిమాపై అంచనాలని పెంచుతూ ప్రమోషన్స్ లో మంచి జోష్ చూపిస్తున్నారు. టీజర్ కి సూపర్బ్ రెస్పాన్స్ రావడంతో కస్టడీ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అరవింద స్వామీ విలన్ గా నటిస్తున్నాడు. నాగ చైతన్య ‘శివ’ అనే పాత్రలో కానిస్టేబుల్ గా నటిస్తున్న కస్టడీ సినిమాని శ్రీనివాస సిల్వర్ స్కీన్ ప్రొడుక్ చేస్తుంది. మే 12న ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీ ట్రైలర్ అనౌన్స్మెంట్ బయటకి వచ్చేసింది. ది హంటింగ్ సీజన్ బిగిన్స్ అంటూ కస్టడీ ట్రైలర్ అనౌన్స్మెంట్ ఇచ్చేసిన మేకర్స్, మే 5న ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు చెప్పేసారు.
ఈ అనౌన్స్మెంట్ పోస్టర్ లో నాగ చైతన్య గన్ పట్టుకోని మస్త్ ఉన్నాడు. ఇదిలా ఉంటే ఇటివలే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నాగ చైతన్య మాట్లాడుతూ… తనకి పెద్దగా బాధలు లేవని, ఎంతో ఇష్టంతో పక్కా హిట్ అవుతుంది అనుకోని చేసిన సినిమాలు ఫ్లాప్ అయినప్పుడే కాస్త అప్సెట్ అవుతానని చెప్పాడు. ప్రస్తుతం నాగ చైతన్య బ్యాక్ టు బ్యాక్ రెండు ఫ్లాప్స్ ఇచ్చాడు. నాగార్జున, అఖిల్ లు కూడా ఫ్లాప్స్ ఇచ్చేసరికి అక్కినేని ఫాన్స్ కంప్లీట్ గా డిజప్పాయింట్ స్టేజ్ లో ఉన్నారు. అక్కినేని ఫాన్స్ లో మళ్లీ జోష్ తీసుకోని రావాలి అంటే చైతన్య కస్టడీ సినిమాతో సూపర్ హిట్ కొట్టాల్సిందే. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి నాగ చైతన్య హిట్ కొడితే అక్కినేని ఫాన్స్ ఫుల్ హ్యాపీ అవుతారు మరి మే 12న కస్టడీ సినిమా ఎలాంటి రిజల్ట్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.
The Hunting Season Begins 🔥#CustodyTrailer Explodes on May 5th!❤️🔥#CustodyOnMay12@chay_akkineni @vp_offl @realsarathkumar @thearvindswami @ilaiyaraaja @thisisysr @IamKrithiShetty @srinivasaaoffl @SS_Screens pic.twitter.com/7aDFqqpj1L
— Srinivasaa Silver Screen (@SS_Screens) May 1, 2023