Akkineni Heros : టాలీవుడ్ లో అక్కినేని ఫ్యామిలీకి ఓ బ్రాండ్ ఉంది. అదేంటంటే.. రొమాంటిక్ లవ్ స్టోరీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అన్నట్టు ఉండేవారు. నాగార్జున తర్వాత వచ్చిన నాగచైతన్య, అఖిల్ అయితే ఎక్కువగా ఇలాంటి సినిమాలే తీశారు. దాంతో లవర్ బాయ్ అనే ట్యాగ్ ను ప్రేక్షకులు తగిలించారు. అదే వారికి కొంత ఇబ్బంది తెచ్చిపెట్టింది. ఎందుకంటే ఇండస్ట్రీలో నిలబడాలంటే మాస్ ఫాలోయింగ్ ఉండాల్సిందే. పైగా డిఫరెంట్ సినిమాలు తీస్తేనే ఫ్యాన్ బేస్ బలంగా ఉంటుంది. కానీ నాగచైతన్య, అఖిల్ ఇలాంటి సినిమాలు చేసి చేతులు కాల్చుకున్నారు. రొటీన్ లవ్ స్టోరీలు తీసి ప్లాపులు మూటగట్టుకున్నారు. ఇప్పుడు ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారు. పైగా రియలస్టిక్ గా ఉండాలంటున్నారు. అందుకే అక్కినేని హీరోలు కూడా రూటు మార్చేశారు.
Read Also : Chiranjeevi : మే9న మెగా ఫ్యాన్స్ కు పండగే.. అటు చిరు.. ఇటు చరణ్
నాగార్జున, చైతన్య, అఖిల్ వరుసగా కొత్తదనం ఉండే సినిమాలే చేస్తున్నారు. తమ సినిమాల్లో కంటెంట్ ఉండటంతో పాటు లుక్ కూడా మార్చేస్తున్నారు. ఇప్పటికే తండేల్ తో మంచి హిట్ అందుకున్నాడు నాగచైతన్య. దీని తర్వాత కార్తీక్ దండుతో కలిసి ఓ భారీ మైథికల్ సినిమా చేస్తున్నాడు. అది కూడా హిట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక అఖిల్ కూడా లవ్ స్టోరీలకు గుడ్ బై చెప్పేసి లెనిన్ తో వస్తున్నాడు. ఇది పూర్తి రియలస్టిక్ సినిమాగా ఉంది. ఇందులో లుక్ పూర్తిగా మార్చేసుకున్నాడు అఖిల్. అటు నాగార్జున కూడా వరుసగా డిఫరెంట్ సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం కుబేర సినిమాతో రాబోతున్నాడు. దానిపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇలా అక్కినేని హీరోలు రొటీన్ రొట్టకొట్టుడు సినిమాలకు బ్రేక్ ఇచ్చేసి.. మంచి కంటెంట్ ఉండే సినిమాలు, మాస్ సినిమాలకే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇది ఒక రకంగా మంచి మార్పు అంటున్నారు. లాంగ్ రన్ లో ఇదే ఎక్కువగా కలిసొస్తుందని చెబుతున్నారు అక్కినేని ఫ్యాన్స్. ఇన్ని రోజులు తాము కోరుకున్నది కూడా ఇదే అంటున్నారు.