Chiranjeevi : మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ అయినా మెగా ఫ్యాన్స్ పండగలా చేసుకుంటారు. ఈ నడుమ మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ సినిమాల నుంచి వరుస అప్డేట్స్ వస్తున్నాయి. అయితే మే 9 మెగా ఫ్యామిలీకి చాలా స్పెషల్. ఎందుకంటే ఇదే రోజున చిరంజీవికి సంబంధించిన ఎన్నో సినిమాలు రిలీజ్ అయి హిట్ అయ్యాయి. అందుకే ఆ రోజున మెగాస్టార్ చిరంజీవి తన బ్లాక్ బస్టర్ మూవీ జగదేక వీరుడు, అతిలోక సుందరి సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమా ఇదే రోజున రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అందుకే మళ్లీ అదే రోజున దీన్ని రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీతో రీ రిలీజ్ ట్రెండ్ లో కొత్త రికార్డు సృష్టించాలని మెగాస్టార్ చూస్తున్నారు.
Read Also : Nani : నాని తొలి పారితోషికం ఎంతో తెలిస్తే షాక్..
ఇక రామ్ చరణ్ కూడా మరో ఘనత సాధించారు. లండన్ లోని ప్రముఖ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో చరణ్ మైనపు విగ్రహాన్ని మే 9న ఆవిష్కరించబోతున్నారు. ఇప్పటికే ఈ మ్యూజియంలో ప్రభాస్, అల్లు అర్జున్ విగ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు టాలీవుడ్ నుంచి చరణ్ విగ్రహం కూడా ఇందులో చేరబోతోంది. త్రిబుల్ ఆర్ సినిమాలో రామ్ చరణ్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అందుకే ఆయన విగ్రహాన్ని మ్యూజియం వాళ్లు అక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. ఇలా ఒకే రోజు రెండు గొప్ప వేడుకలు అక్కడ జరగబోతున్నాయి.