అక్కినేని ప్రిన్స్ అఖిల్ మొదటిసారి పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ నటిస్తున్న సినిమా ‘ఏజెంట్’. స్టైలిష్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని ఏకే ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. షూటింగ్ పార్ట్ ఎప్పుడో కంప్లీట్ చేసుకోని ఏజెంట్ సినిమాని ముందుగా 2021 డిసెంబర్ 24న రిలీజ్ చెయ్యాలి అనుకున్నారు, ఆ తర్వాత 2022 ఆగస్ట్ 12న రిలీజ్ చెయ్యాలి అనుకున్నారు. ఈ సమయంలో అఖిల్ కి ఇంజ్యూరీస్ అవ్వడంతో ఏజెంట్ వాయిదా పడింది. దీంతో 2022 ఆగస్ట్ నుంచి 2023 జనవరికి షెడ్యూల్ అయ్యింది. ఈ టైంలో పెద్ద సినిమాల విడుదల ఉండడంతో ఏజెంట్ ఆగిపోయాడు. షూటింగ్ పార్ట్ ఇంకా కంప్లీట్ కాకపోవడం, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పెండింగ్ ఉండడం లాంటి కారణాల వలన ఏజెంట్ సినిమా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది.
Read Also: NBK 108: బాలయ్య-అనిల్ మంచి జోష్ లో ఉన్నారే…
ఈసారి మాత్రం టార్గెట్ మిస్ కాదు అంటూ ఏప్రిల్ 28న ఏజెంట్ రిలీజ్ డేట్ ని మేకర్స్ అనౌన్స్ చేశారు. చెప్పిన సమయానికి ఎట్టి పరిస్థితిల్లో సినిమాని రిలీజ్ చెయ్యడానికి రెడీ అయిన మేకర్స్ ఏజెంట్ సినిమా ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేశారు. ఇప్పటివరకూ గ్లిమ్ప్స్, టీజర్, సాంగ్స్ తోనే అంచనాలు పెంచుతూ వచ్చిన మేకర్స్ అఖిల్ బర్త్ డే రోజున మూడు స్పెషల్ పోస్టర్స్ ని రిలీజ్ చేశారు. అఖిల్ ని యాక్షన్ మోడ్ లో ప్రెజెంట్ చేస్తూ డిజైన్ చేసిన ఈ పోస్టర్స్ అక్కినేని ఫాన్స్ లో జోష్ నింపింది. ప్రస్తుతం ఏజెంట్ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి, ట్రైలర్ తో పాజిటివ్ వైబ్ ని సెట్ చేస్తే చాలు అఖిల్ ఖాతాలో సాలిడ్ హిట్ పడినట్లే. ఇప్పుడున్న హైప్ ని మేకర్స్ ఇలానే సస్టైన్ చేస్తూ వెళ్లాలి, అప్పుడే ఏప్రిల్ 28న సాలిడ్ ఓపెనింగ్స్ వస్తాయి. మరి ఈ జోష్ ని ఇంకో మూడు వారాల పాటు ఏజెంట్ మేకర్స్ మైంటైన్ చేస్తారేమో చూడాలి.
A soul so chilled with Action so WILD🔥
Team #AGENT wishes @AkhilAkkineni8 a very Happy Birthday❤️
Excited for the Audience to join your wild ride in theatres from APRIL 28th💥#HBDAkhilAkkineni#AGENTonApril28th@mammukka @DirSurender @AnilSunkara1 @AKentsOfficial pic.twitter.com/N0iucymncr
— AK Entertainments (@AKentsOfficial) April 8, 2023
The celebrations have just begun😎
Here’s a b’day special
ACTION POSTER of #AGENT @AkhilAkkineni8 🔥WILD ACTION Loading in theatres from APRIL 28th💥#HBDAkhilAkkineni#AGENTonApril28th@mammukka @DirSurender @sakshivaidya99 @AnilSunkara1 @hiphoptamizha pic.twitter.com/p6qxJaEs9I
— AK Entertainments (@AKentsOfficial) April 8, 2023