అక్కినేని అఖిల్, స్టైలిష్ ఫిల్మ్ మేకర్స్ సురేందర్ రెడ్డితో కలిసి చేసిన సినిమా ‘ఏజెంట్’. ఏప్రిల్ 28న భారి అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ ఊహించని నెగటివ్ రిజల్ట్ ని ఫేస్ చేసింది. ఫస్ట్ డే మార్నింగ్ షో నుంచే నెగటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వడంతో ఈవెనింగ్ షోలు కూడా ఫుల్ అవ్వలేదు. ఫస్ట్ డేనే వీక్ కలెక్షన్స్ అంటే ఇక సెకండ్ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించొచ్చు. పొన్నియిన్ సెల్వన్ 2 సినిమాకే షాక్ రేంజులో ప్రమోట్ అయిన ఏజెంట్ సినిమా సెకండ్ డే తెలుగు రాష్ట్రాల్లో 67 లక్షలు కూడా కలెక్ట్ చెయ్యలేకపోయింది. ముఖ్యంగా నైజాంలో ఏజెంట్ సినిమా సెకండ్ డే మరీ వీక్ గా 21 లక్షలు మాత్రమే వసూల్ చేసింది. దాదాపు 80 కోట్ల బడ్జట్ తో రూపొందిన ఈ మూవీ, థియేట్రికల్ బిజినెస్ 37 కోట్ల వరకూ జరిగింది. సెకండ్ డేకే 60 లక్షలు అంటే ఇక మండే నుంచి ఏజెంట్ సినిమాకి బుకింగ్స్ రావడం కష్టమే.
ఏజెంట్ సినిమాకి కేటాయించిన థియేటర్స్, ప్రస్తుతం విరుపాక్ష సినిమాకి షిఫ్ట్ అవుతున్నాయి. దీంతో ఏజెంట్ సినిమా టాలీవుడ్ చూసిన బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచేలా ఉంది. అక్కినేని అభిమానులు భారి అంచనాలు పెట్టుకున్నా ఏజెంట్ మూవీ ఇలా డిజాస్టర్ అవ్వడం అందరికీ ఊహించని షాక్ ఇచ్చింది. మరి ఈ మూవీతో మాస్ హిట్ కోడతాడు అనుకున్న అఖిల్, నెక్స్ట్ ఎలాంటి సినిమాతో ఆడియన్స్ ముందుకి వస్తాడు? ఎవరితో సినిమా చేస్తాడు? ఆ మూవీని బయ్యర్స్ కొనడానికి ముందుకి వస్తారా? అఖిల్ ఫ్యూచర్ ప్లాన్ ఎలా ఉండబోతుంది అనేది చూడాలి. ఇప్పటికైతే అఖిల్, నెక్స్ట్ ప్రాజెక్ట్ యువీ క్రియేషన్స్ తో ఉంటుంది అనే వార్త సోషల్ మీడియాలో వినిపిస్తోంది మరి అందులో ఎంతవరకూ నిజం ఉంది అనే విషయంలో క్లారిటీ రావాలి అంటే మరికొన్ని రోజుల పాటు వెయిట్ చెయ్యాల్సిందే.