Akhil Sarthak supports Pallavi Prasanth : బిగ్ బాస్ సీజన్ 7 లోకి అడుగుపెట్టిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ తాజా నామినేషన్స్ లో టార్గెట్ అయ్యాడు. పల్లవి ప్రశాంత్ ను ఏకంగా తొమ్మిది మంది నామినేట్ చేశారు. నామినేషన్స్ ప్రక్రియలో అమర్ దీప్- ప్రశాంత్, గౌతమ్ కృష్ణ- ప్రశాంత్ మధ్య జరిగిన వాగ్వివాదం చర్చనీయాంశం అయ్యింది. రైతు బిడ్డ అనే సెంటిమెంట్ వాడుకుంటూ సింపతీ క్రియేట్ చేసుకుంటున్నావంటూ అందరూ ప్రశాంత్ ను టార్గెట్ చేశారు. ఇక ముందుగా ప్రశాంత్ ను సపోర్ట్ చేస్తూ పోస్ట్ పెట్టిన అఖిల్ సార్థక్ ఇప్పుడు ఏకంగా ఒక వీడియో రిలీజ్ చేశాడు. అమర్ దీప్, రతిక చేసిన పని తనకి ఎంత మాత్రం నచ్చలేదని పేర్కొన్న అఖిల్ పల్లవి ప్రశాంత్ నామినేషన్ చూస్తే చాలా బాధగా అనిపించిందని అన్నాడు.
Nandamuri Balakrishna: నందమూరి బాలక్రిష్ణని కలిసిన ఎమ్మెల్యే శ్రీదేవి, కుమార్తెలు!
రా, రేయ్ అంటూ కొంతమంది ప్రశాంత్ గురించి వల్గర్ గా మాట్లాడారు కానీ తను మాత్రం అక్క, అన్న, చెల్లి అంటూ రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ తన వాయిస్ వినిపించేందుకు ట్రై చేస్తుంటే ఆపేశారని అన్నారు. అదే ప్రశాంత్ స్థానంలో శివాజీ ఉంటే ఎవరూ ఒక్క మాట కూడా మాట్లాడేవాళ్ళు కాదని అన్నాడు. ప్రశాంత్ కాబట్టి అందరూ టార్గెట్ చేశారు, వీడియోస్ లో అతను బతిమలాడుకున్నాడని అంటున్నారు అది అందరికీ తెలిసిందే కానీ దాన్ని గుర్తు చేస్తూ అడుక్కుని వచ్చావని అనడం చాలా తప్పని అన్నాడు. అతను గేమ్ ఆడటానికి వచ్చాడు, ఒకర్ని అడిగేటప్పుడు చేతులు జోడించి అడుగుతారు కానీ గేమ్ కోసం ఆడుతున్నాడు అన్నీ ఎమోషన్స్ చూపిస్తున్నాడు మరి అందులో తప్పేముందని అఖిల్ ప్రశ్నించాడు. నువ్వేం దిగులు పడకు ప్రశాంత్, ‘జై జవాన్.. జై కిసాన్’ తను ఎక్కడి నుంచి వచ్చాడనే విషయం మర్చిపోలేదు అందుకే అందరూ అతడిని గౌరవించండి అంటూ అఖిల్ సార్థక్ వీడియో పోస్ట్ చేశాడు.