YSRCP Suspended MLA Vundavalli Sridevi Meets Balakrishna: వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి టీడీపీ నేతలతో కలియు కనిపిస్తున్నారు. ఇటీవల నారా లోకేష్ యువగళం యాత్రలో కూడా తన కుమార్తెలతో కలసి పాల్గొన్న ఆమె చంద్రబాబు అరెస్ట్ తర్వాత బాలయ్యను కుమార్తెలతో కలవడం విశేషం.
షారుఖ్ ఖాన్ రీల్ తల్లి రియల్ లైఫ్లో ఎంత హాట్‌గా ఉందో చూశారా?
మంగళగిరి టీడీపీ కార్యాలయంలో తన కుమార్తెలతో సహా బాలయ్యను కలిసిన శ్రీదేవి బాలయ్యతో సెల్ఫీలు దిగారు. బాలయ్య కూడా అంతే హుషారుగా వారితో మాట్లాడుతూ నవ్వుతూ కనిపించారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత మంగళగిరి పార్టీ ఆఫీస్ గంభీరంగా మారగా, ఈరోజు మాత్రం కొంత ఆ పరిస్థితి మారింది. నిజానికి చంద్రబాబు జైలులో ఉండగా యువగళాన్ని పక్కనపెట్టి లోకేష్ రాజమండ్రికి తల్లి భార్యతో పరిమితం కాగా, బాలయ్య మాత్రం మంగళగిరి పార్టీ ఆఫీస్ లో నేతలకు అందుబాటులో ఉన్నారు.
నిన్న ప్రెస్ మీట్ లో జగన్ పై సంస్కృతంలో ధ్వజమెత్తిన బాలకృష్ణ, ఈరోజు పార్టీ నాయకులతో సమయం గడిపారు. పరామర్శలకు తాను వస్తున్నానని, ఇకపై పార్టీ కేడర్ కు తాను అండగా ఉంటానని చెబుతున్న బాలయ్య ఈ క్రమంలో ఉండవల్లి శ్రీదేవి సహా మరికొందరు నాయకులు బాలయ్యని కలవడం కూడా ఆసక్తికరంగా మారింది. గతంలో హైదరాబాదులో డాక్టర్ గా పనిచేసిన ఉండవల్లి శ్రీదేవి రిజర్వుడు నియోజకవర్గం అయిన తాడికొండ నుంచి బరిలోకి దిగారు.
రాజధాని ప్రాంతం అయిన ఆ నియోజకవర్గంలో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ ను ఓడించి ఎమ్మెల్యే అయ్యారు. ఇక టీడీపీ నుంచి వైసీపీలో చేరిన డొక్కాకి వైసీపీ ప్రాధాన్యత ఇస్తూ ఉండడంతో ఆమె పార్టీ మీద అనేక ఆరోపణలు చేసి బయటకొచ్చారు. ఈసారి టీడీపీ నుంచి ఆమె టికెట్ ఆశిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.