Agent: గన్ను పట్టుకోని గన్నులా ఉన్నాడు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని అఖిల్ పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ, స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డితో కలిసి చేస్తున్న సినిమా ‘ఏజెంట్’. మమ్ముట్టీ స్పెషల్ రోల్ ప్లే చేస్తున్న ఈ మూవీపై భారి అంచనాలు ఉన్నాయ్. గ్లిమ్ప్స్ తోనే హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ని సెట్ చేసిన సురేందర్ రెడ్డి అండ్ అఖిల్ పక్కా హిట్ కొడతారు అనే నమ్మకం అందరిలో కలిగించారు. టీజర్ లో చూపించిన ఒక ఫైట్ సీన్ లో అఖిల్ డాన్స్ చేస్తూ గన్స్ ఫైర్ చేస్తుంటే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ… అఖిల్ ని నెక్స్ట్ పాన్ ఇండియా స్టార్ అవుతాడు అంటూ కాంప్లిమెంట్స్ ఇచ్చేశారు. స్టైలిష్ మేకర్ గా పేరున్న సురేందర్ రెడ్డి, అఖిల్ లాంటి అల్ట్రా మోడరన్ హీరో దొరకగానే.. తన పొటెన్షియాలిటి మొత్తం తెరపై చూపించడానికి రెడీ అయినట్లు ఉన్నాడు. పోస్టర్స్ తోనే హీటు పెంచుతున్న ఈ మూవీ నుంచి అఖిల్ బర్త్ డే స్పెషల్ పోస్టర్ బయటకి వచ్చేసింది. బుడాపెస్ట్ లో షూట్ చేసిన ఫైట్ నుంచి రిలీజ్ చేసిన ఈ పోస్టర్ లో అఖిల్ గన్ను పట్టుకున్న ఇంకో గన్నులా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. బాలీవుడ్ రేంజ్ హీరోలా కనిపిస్తున్న అఖిల్ పుట్టిన రోజు ఏప్రిల్ 8, అందుకే అక్కినేని ఫాన్స్ కి గిఫ్ట్ గా ఒక రోజు ముందే మేకర్స్ ఈ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో పోస్టర్ ట్రెండ్ అవుతోంది. ఏప్రిల్ 8న మరిన్ని అప్డేట్స్ వస్తాయి వెయిట్ చెయ్యండి అంటూ మేకర్స్ చిన్న హింట్ కూడా ఇచ్చారు. మరి ట్రైలర్ అప్డేట్ ఏమైనా ఇస్తారేమో చూడాలి.
Read Also:Nandamuri Balakrishna: నవరత్నాల మాయలో పడొద్దు
Also Read
- Lenin Success Meet: 'లెనిన్' సక్సెస్ మీట్లో భావోద్వేగానికి గురైన భాగ్యశ్రీ.. 'వాళ్ల ప్రేమే నా అతిపెద్ద అవార్డు'!
- Nick Jonas: హాలీవుడ్ రేంజ్‌కి ఎదిగిన బాలీవుడ్ హీరోయిన్‌తో తన ప్రేమ ఎలా మొదలైందో చెప్పిన ప్రియాంక చోప్రా భర్త!
- Grand Comeback: హ్యాట్రిక్ ప్లాన్‌తో వస్తున్న హీరో.. గ్రాండ్ కంబ్యాక్‌కు మాస్టర్ స్ట్రాటజీ!
- SS Rajamouli: ఎవరూ ఊహించని హీరోతో దర్శకధీరుడు రాజమౌళి కొత్త సినిమా?
ఇదిలా ఉంటే ఈ మూవీని ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. బాహుబలి 2 రిలీజ్ అయిన డేట్ కే తెలుగు నుంచి విడుదలవ్వనున్న పాన్ ఇండియా సినిమాగా ‘ఏజెంట్’ హిట్ కొడుతుందని సినీ అభిమానులు నమ్మకంతో ఉన్నారు. ఇదే డేట్ కి మణిరత్నం డైరెక్ట్ చేసిన ‘పొన్నియిన్ సెల్వన్ ఫ్రాంచైజ్’ నుంచి పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా కూడా రిలీజ్ అవుతోంది. ఈ మూవీ కారణంగా అఖిల్ మూవీకి తమిళనాడు, ఓవర్సీస్ ఏరియాల్లో ఓపెనింగ్స్ తగ్గే ఛాన్స్ ఉంది. తెలుగులో మాత్రం అఖిల్ ఎక్కువ కలెక్ట్ చేస్తాడు కానీ తమిళ్, హిందీ, ఓవర్సీస్ లాంటి ఏరియాల్లో పొన్నియిన్ సెల్వన్ 2 సినిమాకే ఎక్కువ ఎడ్జ్ ఉంది. పైగా ఏప్రిల్ 28కి సరిగ్గా ఒక్క వారం ముందు బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్ ‘కిసీ కా భాయ్, కిసీ కా జాన్’ సినిమాతో ఆడియన్స్ ముందుకి వస్తున్నాడు. ఈ మూవీ రిజల్ట్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ ని రాబడుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ పోటీని దాటుకోని అఖిల్ ఏజెంట్ గా పాన్ ఇండియా హిట్ కొడతాడో లేదో చూడాలి.
The Advance celebrations begin 💥
Team #AGENT wishes the WILD ONE, @AkhilAkkineni8 a blockbuster birthday 😎
More surprises awaiting ahead🤘#HBDAkhilAkkineni ❤️#AGENTonApril28th 🔥@mammukka @DirSurender @sakshivaidya99 @AnilSunkara1 @hiphoptamizha @Laharimusic pic.twitter.com/SZSDtTTUGq
— AK Entertainments (@AKentsOfficial) April 7, 2023
తాజావార్తలు
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్‌లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
-
New Country: ఐసీసీ సభ్యత్వం పొందిన మరో దేశం.. మొత్తం 111కు చేరిన సంఖ్య..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!