Kavya Maran-Anirudh Wedding: పురోహితులు లేకుండానే పెళ్లి.. ‘స్వాభిమానం’ మ్యారేజ్ అంటే?.. అనిరుధ్, కావ్య వివాహ వేడుకలో ఆసక్తికర విశేషాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kavya Maran-Anirudh Self-Respect Marriage: ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని కావ్య మారన్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. నవంబర్ 11న గ్రీస్‌లో వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదే సమయంలో అనిరుధ్-కావ్య పెళ్లికి అనుసరించిన సంప్రదాయాలు కూడా నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా కావ్య మెడలో అనిరుధ్ ఓ గొలుసు కడుతున్నట్లు కనిపించిన ఫొటో వైరల్ కావడంతో.. వీరిది ‘స్వాభిమానం’ వివాహమా? అనే చర్చ మొదలైంది.
పూలమాలలు, గొలుసులు మార్చుకున్న అనిరుధ్, కావ్య:
ఈ నేపథ్యంలో ద్రవిడ మున్నేట్ర కళగం (డీఎంకే) ఐటీ విభాగం కార్యదర్శి డాక్టర్ టీఆర్బీ రాజా పెళ్లి వేడుకలో జరిగిన ఆచారాలపై స్పష్టత ఇచ్చారు. అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ స్వాభిమానం వివాహం చేసుకున్నారని ఎక్స్ వేదికగా వెల్లడించారు. వివాహ వేడుకలో అనిరుధ్, కావ్య ఒకరికొకరు పూలమాలలు, గొలుసులు మార్చుకున్నారని రాజా తెలిపారు. ఇరువురి కుటుంబ సభ్యులు, స్నేహితులు నూతన దంపతులను ఆశీర్వదించారని పేర్కొన్నారు. ‘అవును.. కావ్య, అనిరుధ్ ఒకరికొకరు పూలమాలలు వేసుకున్నారు. తలైవర్ కావ్యకు ఒక గొలుసును అందించగా, సూపర్‌స్టార్ అనిరుధ్‌కు మరో గొలుసును అందించారు. అనంతరం వధూవరులు ఒకరికొకరు గొలుసులు మార్చుకున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల ఆశీస్సులతో వారి హృదయాల కలయిక జరిగింది’ అని రాజా వివరించారు.
Also Read
- Kiran Abbavaram: వారి కోసమే 'రియాలిటీ' మూవీ చేశా.. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు!
- Siddu Jonnalagadda: ఏడాది గ్యాప్ తర్వాత రూట్ మార్చిన సిద్ధు జొన్నలగడ్డ!
- Nandamuri Tejaswini: ప్రొడ్యూసర్‌గా బాలయ్య చిన్న కూతురు.. డైరెక్టర్ ఎవరంటే?
- Anaswara Rajan: ఆ బ్యూటీకి రామ్ చరణ్ స్పెషల్ బూస్ట్! కొత్త సినిమాతో జాతకం మారేనా..
స్వాభిమానం వివాహం అంటే ఏమిటి?:
తమిళనాడులో సామాజిక సంస్కర్త పెరియార్ ఈవీ రామసామి ప్రారంభించిన స్వాభిమానం ఉద్యమం నుంచి ఈ వివాహ సంప్రదాయం ఆవిర్భవించింది. కుల వివక్ష, సంప్రదాయ వివాహ ఆచారాలు, పెళ్లిళ్లలో మతపెద్దల ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ ఈ ఉద్యమం ముందుకు సాగింది. స్వాభిమానం వివాహంలో వధూవరులు ఒకరినొకరు జీవిత భాగస్వాములుగా అంగీకరిస్తూ తమ నిబద్ధతను ప్రకటిస్తారు. ఇందుకోసం పూలమాలలు లేదా ఉంగరాలు మార్చుకోవచ్చు. కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా ఇతర సాక్షుల సమక్షంలో ఈ వేడుక జరుగుతుంది. సాధారణంగా ఇందులో పురోహితుడు లేదా విస్తృతమైన మతపరమైన క్రతువులు తప్పనిసరి కావు.
చట్టబద్ధమైన గుర్తింపు:
1967లో తమిళనాడులో ఈ వివాహ పద్ధతికి చట్టబద్ధమైన గుర్తింపు లభించింది. హిందూ వివాహ చట్టానికి చేసిన సవరణ ద్వారా సంప్రదాయ మతపరమైన వేడుకలు లేకుండానే స్వాభిమానం వివాహాలను చట్టబద్ధంగా నిర్వహించుకునే అవకాశం కల్పించారు. ఇలా అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ తమ వివాహ వేడుకలో స్వాభిమానం వివాహ పద్ధతిని అనుసరించినట్లు డీఎంకే నేత టీఆర్బీ రాజా వెల్లడించడంతో ఈ పెళ్లి మరోసారి వార్తల్లో నిలిచింది.
తాజావార్తలు
-
Kavya Maran-Anirudh Wedding: పురోహితులు లేకుండానే పెళ్లి.. ‘స్వాభిమానం’ మ్యారేజ్ అంటే?.. అనిరుధ్, కావ్య వివాహ వేడుకలో ఆసక్తికర విశేషాలు!
-
Kiran Abbavaram: వారి కోసమే ‘రియాలిటీ’ మూవీ చేశా.. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు!
-
Ragiri Satyanarayana: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇరిగేషన్ డీఈఈ సత్యనారాయణ గౌడ్ అరెస్ట్
-
Best Wood for Furniture: ఇంటి ఫర్నీచర్‌కు ఏ కలప బెస్ట్? టేకు నుంచి శీశం వరకు.. చెదలు పట్టకుండా ఏం చేయాలి?
-
Sonia Gandhi Autobiography: సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకాన్ని తగలబెట్టి.. 1984 సిక్కు అల్లర్ల బాధిత కుటుంబాల నిరసన
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!