Akhanda Screening At Goa IFFI: నందమూరి అభిమానులని దిల్ ఖుష్ చేసే వార్తలు ఈరోజు సోషల్ మీడియాలో చాలానే వచ్చాయి. ఎన్టీఆర్ నటించిన అడ్వర్టైజ్మెంట్ బయటకి రావడం, బాలయ్య నటిస్తున్న ‘వీర సింహా రెడ్డి’ ఫస్ట్ సింగల్ అప్డేట్ రావడం… ఇలా నందమూరి అభిమానులకి ఒకే రోజు రెండు స్పెషల్ న్యూస్‌లు బయటకి వచ్చాయి. దీంతో తారక్ అండ్ బాలయ్య ఫాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ట్విట్టర్‌లో ట్రెండ్ చేస్తున్న నందమూరి ఫాన్స్‌కి మరో స్పెషల్ గిఫ్ట్ వచ్చింది. ‘వీర సింహా రెడ్డి’ అప్డేట్ బయటకి వచ్చిన ఆనందంలో ఉన్న ఫాన్స్‌కి, అఖండ సినిమా సాలిడ్ సర్ప్రైజ్‌ని ఇచ్చింది.
బోయపాటి శ్రీను, బాలకృష్ణలది బ్లాక్‌బస్టర్ కాంబినేషన్, ఇప్పటికే రెండు సార్లు ప్రూవ్ అయిన ఈ విషయాన్ని మూడోసారి కూడా నిరూపించిన చిత్రం ‘అఖండ’. ఈ సినిమాలో అఘోరాగా బాలయ్య చేసిన యాక్టింగ్‌కి థియేటర్స్‌లో మాస్ పూనకాలే వచ్చాయి. బాలయ్య రోరింగ్ పెర్ఫార్మెన్స్‌కి థమన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా కలవడంతో అఖండ థియేటర్స్‌లో జాతర చేసింది. టికెట్ రేట్స్ తక్కువ టైంలో ప్రేక్షకుల ముందుకి వచ్చి వసూళ్ల వర్షం కురిపించిన అఖండ సినిమా బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అంత పెద్ద హిట్ అయిన అఖండ మూవీని గోవాలో జరుగుతున్న 53వ ఇఫ్ఫీ ఫిల్మ్‌లో స్క్రీనింగ్ చేయనున్నట్టు ద్వారకా క్రియేషన్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఎవరూ ఊహించని టైంలో ఈ అనౌన్స్మెంట్ బయటకి రావడంతో, వీర సింహా రెడ్డితో పాటు అఖండ కూడా ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది.