వస్తే అతి వృష్టి.. లేదా అనా వృష్టిలా ఉంటుంది టాలీవుడ్ పరిస్థితి. చిన్న హీరో నుండి స్టార్ హీరో వరకు అందరు ఇంతే. ఇప్పుడు రాబౌయే సెప్టెంబర్ రేస్ లో రెండు పెద్ద సినిమాలు నువ్వు నేనా అనే రీతిలో పోటిపడుతున్నాయి. సెప్టెంబర్ 25 మేము వచ్చేది ఫిక్స్ వెనకడుగు వేసేది లేదు అని ఓ సినిమా నిర్మాత అంటే మేము ఎట్టి పరిస్థితుల్లో వచ్చి తీరతాం అని చెప్తున్నారు.
వివరాలలోకెలితే బోయపాటి శ్రీను – బాలయ్య కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ అఖండ కు సీక్వెల్ గా వస్తుంది అఖండ 2. భారీ అంచనాల మధ్య భారీ బడ్జెట్ పై వస్తున్న ఈ సినిమాను సెప్టెంబరు 25న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తామని ఇది వరకే ప్రకటించారు మేకర్స్. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవి OG. సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కూడా సెప్టెంబర్ 25న రిలీజ్ కానుందని ప్రకటించారు. అయితే OG షూటింగ్ ముగించేసుకుని రెడీ గా ఉంది. కానీ బాలయ్యా – బోయపాటిల అఖండ 2 షూటింగ్ ఇంకా జరుగుతుండడంతో సెప్టెంబర్ 25 రిలీజ్ ఉండదు వాయిదా పడుతుందని టాక్ వినిపించింది. కానీ కేవలం ఒకే ఒక సాంగ్ మినహా షూట్ మొత్తం ఫినిష్ అయింది మరో వారం రోజుల్లో ఫినిష్ చేసేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫినిష్ చేసి రిలీజ్ కు రెడీ అవుతామని యూనిట్ నుండి సమాచారం. సో సెప్టెంబర్ 25న రెండు సినిమాలు రిలీజ్ కావడం ఫిక్స్. ఈ విషయంలో ఎవరు తగ్గదేలే అనే చెప్తున్నారు.