తల అజిత్ కి కోలీవడ్ లో సాలిడ్ ఫ్యాన్ బేస్ ఉంది. రజినీకాంత్ తర్వాత ఆ రేంజ్ మాస్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్న అజిత్ కి సినిమాలు అంటే ఇష్టం లేదో లేక అదే పనిగా సినిమాలు చేయడం నచ్చదో తెలియదు కానీ తన సినిమా ఫంక్షన్స్ కి రాడు, ప్రమోషన్స్ ని చేయడు, షూటింగ్ చేసి సైలెంట్ అయిపోతుంటాడు. సినిమా సినిమాకి మధ్య కూడా అజిత్ చాలా గ్యాప్ మైంటైన్ చేస్తూ ఉంటాడు, ఒక సినిమా చేసినా అది ఎప్పుడు కంప్లీట్ అవుతుందో ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎవరికీ తెలియదు. అజిత్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ప్రతి సినిమా అప్డేట్ ఇవ్వండ్రా బాబు అంటూ ప్రొడ్యూసర్స్ ని ట్యాగ్ చేసి రచ్చ చేస్తుంటారు. అజిత్ ప్రతి సినిమాకి ఇది సోషల్ మీడియాలో ఆనవాయితీగా జరుగుతూ ఉంటుంది.
లేటెస్ట్ గా అజిత్ తన నెక్స్ట్ సినిమా ‘విడ ముయార్చి’ని మజిల్ తిరుమేణి దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ సినిమా చాలా ఆలస్యం తర్వాత సెట్స్ పైకి వెళ్లి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. విడ ముయార్చి సినిమా నుంచి అప్డేట్ ఎప్పుడు వస్తుందా అని అజిత్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ అప్డేట్ ఎప్పుడు బయటకి వస్తుందో తెలియక తికమకలో ఉంటే ఒక వర్గం అజిత్ ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో అప్పుడే AK63 సినిమా గురించి చర్చ మొదలుపెట్టారు. AK63 ప్రాజెక్ట్ ని అజిత్ డైరెక్టర్ వెట్రిమారన్ తో చేయనున్నాడు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. వెట్రిమారన్ ని ఇప్పటికే వాడివాసల్, ధనుష్ తో సినిమా, విడుదలై 2 సినిమాలు లైనప్ లో ఉన్నాయి. ఇవే ఎప్పుడు కంప్లీట్ అవుతాయే తెలియదు అలాగే అజిత్ విడ ముయార్చి ఎప్పుడు పూర్తి చేస్తాడో తెలియదు. ఇలాంటి సమయంలో ఇప్పటి నుంచే AK63 ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకోవడం ఎందుకో అజిత్ ఫ్యాన్స్ కే తెలియాలి.