తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ సినిమా ‘విదాముయార్చి’. మాగిజ్ తిరుమేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించగా యాక్షన్ కింగ్ అర్జున్, రెజీనా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను భారీ బడ్జెట్ సినిమాల నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. ఈ నెల 6న విదాముయార్చి వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. హాలీవుడ్ సినిమా బ్రేక్ డౌన్ రీమేక్ గా వచ్చిన విదాముయార్చి…
తల అజిత్ కి కోలీవడ్ లో సాలిడ్ ఫ్యాన్ బేస్ ఉంది. రజినీకాంత్ తర్వాత ఆ రేంజ్ మాస్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్న అజిత్ కి సినిమాలు అంటే ఇష్టం లేదో లేక అదే పనిగా సినిమాలు చేయడం నచ్చదో తెలియదు కానీ తన సినిమా ఫంక్షన్స్ కి రాడు, ప్రమోషన్స్ ని చేయడు, షూటింగ్ చేసి సైలెంట్ అయిపోతుంటాడు. సినిమా సినిమాకి మధ్య కూడా అజిత్ చాలా గ్యాప్ మైంటైన్ చేస్తూ ఉంటాడు, ఒక…