ఒక హిట్ సినిమాని రీమేక్ చేయాలి అంటే చాలా జాగ్రతలు తీసుకోవాలి, ఒరిజినల్‌ని అలానే తెరకెక్కిస్తే ఫ్రేమ్ బై ఫ్రేమ్ కాపీ అంటారు. కొంచెం మార్చి తీస్తే ఒరిజినల్ సినిమాలో ఉన్న ఫ్లేవర్ మిస్ అయ్యింది అంటారు. ఇప్పుడు ఇలాంటి మాటే అజయ్ దేవగన్ నటిస్తున్న ‘భోలా’ సినిమా గురించి కూడా వినిపిస్తోంది. రీసెంట్‌గా దృశ్యం 2 సినిమా చేసిన అజయ్ దేవగన్, ఒరిజినల్ దృశ్యం 2 సినిమాకి పెద్దగా మార్పులు చేయకుండా ఒరిజినల్‌కి స్టిక్ అయ్యి సూపర్ హిట్ కొట్టాడు. ఇదే జోష్‌లో అజయ్ దేవగన్ మరో రీమేక్ సినిమాని ఆడియన్స్ ముందుకి తీసుకొని రావడానికి రెడీ అవుతున్నాడు. తెలుగు తమిళ భాషల్లో సూపర్ హిట్ అయిన ‘ఖైదీ’ సినిమాని హిందీలో ‘భోలా’ అనే టైటిల్‌తో అజయ్ దేవగన్ రీమేక్ చేస్తున్నాడు. తనే డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి సెకండ్ టీజర్‌ని వదిలారు, ఈ టీజర్ చూస్తే.. అసలు ఇది ఖైదీ సినిమానేనా? లేక అజయ్ దేవగన్ ఇంకేదైనా సినిమా చేస్తున్నాడా? అనిపించక మానదు.
గతంలో వచ్చిన టీజర్ 1 తోనే ఈ డౌట్ కలిగించిన అజయ్ దేవగన్, టీజర్ 2తో భోలా సినిమా ఖైదీ రీమేక్ అయ్యి ఉండడులే అనే నమ్మకాన్ని నిజం చేసే రేంజ్ విజువల్స్ చూపించాడు. ఖైదీ సినిమా నైట్ ఎఫెక్ట్ లో స్టార్ట్ అయ్యి నైట్ ఎఫెక్ట్ లోనే ఎండ్ అవుతుంది. భోలా మాత్రం నైట్, డే అనే తేడా లేకుండా తెరకెక్కింది. ఫ్లాష్ బ్యాక్ కలిపారో లేక కథని మాత్రం అలానే ఉంచి మిగిలినది అంతా మార్చి కొత్త సినిమా తీస్తున్నారో తెలియదు కానీ అజయ్ దేవగన్ మాత్రం భోలా టీజర్ 2తో అందరికీ షాక్ ఇచ్చాడు. టీజర్ 2లో అక్కడక్కడా చూపించిన కొన్ని షాట్స్ ని చూసి ఇది ఖైదీ సినిమా అనుకోవాలి తప్ప మిగిలిన ‘దేవుడు’, ‘ఫాంటసీ’ లాంటి ఎలిమెంట్స్ చూస్తుంటే ఇది ఖైదీ మూవీ కాదు అఖండ మూవీనేమో అనిపించకమానదు. తమిళ్ లో పోలిస్ ఆఫీసర్ పాత్రని యాక్టర్ ‘నరైన్’ చెయ్యగా హిందీలో ఈ పాత్రని ‘టబు’ ప్లే చేసింది. ఇక్కడి నుంచి మొదలైన మార్పు ఖైదీ సినిమా మొత్తం కంటిన్యు అయినట్లు ఉంది. మార్పులు చేస్తే చేశాడు కానీ హిట్ కొడితే అది చాలు, మరి అజయ్ దేవగన్ తనే హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న భోలా మూవీతో హిట్ కొడతాడో లేదో తెలియాలి అంటే మార్చ్ 30 వరకూ వెయిట్ చెయ్యాల్సిందే.