ఐశ్వర్య మీనన్.. ఈ అమ్మడు పేరు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.. తమిళ్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఐశ్వర్య తెలుగులో నిఖిల్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది.. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్న హిట్ ను అందుకోలేదు.. దాంతో అమ్మడుకు అంతగా గుర్తింపు రాలేదు.. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటు లేటెస్ట్ ఫొటోలతో యూత్ ఫాలోయింగ్ ను పెంచుకుంటూ వస్తుంది.. ఆ ఫోటోలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి..
ప్రస్తుతం మమ్ముట్టి హీరోగా నటిస్తున్న సినిమా “బజూకా” లో ఐశ్వర్య మీనన్ నటిస్తుంది. అయితే ఆ సినిమాలో ఐశ్వర్య హీరోయినా లేక గెస్ట్ రోల్ చేసిందా అనేది తెలియలేదు.. ఇక తెలుగు ఆఫర్స్ రాలేదని అందరు అనుకున్నారు. కానీ ఈ అమ్మడు అందరికి షాక్ ఇచ్చేసింది.. తెలుగులో రెండో సినిమాలో చేస్తుంది.. సైలెంట్ గా ఆ సినిమాను పూర్తి చేసే పనిలో ఉంది.. తాజాగా కార్తికేయ సినిమాలో నటిస్తున్నట్టు తన ఇంస్టాగ్రామ్ నుండి రివీల్ అయింది. కార్తికేయ హీరోగా నటిస్తున్న సినిమా షూటింగ్ సెట్స్ లో ఈ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి బర్త్ డే సెలెబ్రేషన్స్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది…
ఇకపోతే కార్తికేయ, ఐశ్వర్య మీనన్ జంటగా నటిస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ వారు నిర్మిస్తుండగా, ప్రశాంత్ రెడ్డి చంద్రపు దర్శకుడుగా పరిచయమవుతున్నాడు. ఇతడు ఇంతకు ముందు సాహో సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసినట్లు తెలుస్తుంది.. రెండో సినిమాతో అయిన సక్సెస్ ట్రాక్ ను కొనసాగిస్తుందేమో చూడాలి.. ఈ సినిమా తర్వాత మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి.